చంద్రబాబు చేసిన మోసాళ్లో డజన్ పసుపు ఛానళ్లు, రెండు పసుపు పత్రికలు వాటాదారులని ఏపీ సీఎం జగన్ అన్నారు. కాపు నేస్తం సభలో మాట్లాడుతున్న ఆయన… ఎన్నోసార్లు బాబు తప్పు చేశాడని తెలిసినా.. బాహాటంగా, అడ్డగోలుగా బాబుకు మద్దతిస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లను వ్యతిరేకించాలని జగన్ పిలుపునిచ్చారు. తప్పును నిలదీయకపోగా.. బాబు చేసిందే నిజమని నిస్సిగ్గుగా ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఓ ఫేక్ అగ్రిమెంట్ సృష్టించి ప్రభుత్వ నిబంధనలను సాక్షాత్తు చంద్రబాబే పక్కనపెట్టించారన్నారు. సీమెన్స్ కంపెనీనే రూ.370కోట్లు ముట్టలేదని లిఖితపూర్వకంగా ఇచ్చినా, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు, దొంగలను సీఐడీ అరెస్టు చేసినా ఇంకా ఆయనకే మద్దతు ఇస్తున్నారని జగన్ మండిపడ్డారు.