ఉప్పల్ : ఉప్పల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి హాజరయ్యారు.
మట్టి గణపతి విగ్రహాలను భక్తులకు పంపిణీ చేసి..పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలని కోరారు.
ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సామాజిక సేవ కార్యక్రమాలు చేయడాన్ని అభినందించారు.
కార్యక్రమంలో ఉప్పల్ సర్కిల్ CI గోవింద రెడ్డి, ప్రెస్ క్లబ్ జర్నలిస్టు సోదరులు, బి ఆర్ ఎస్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, గరిక సుధాకర్, వేముల సంతోష్ రెడ్డి, అన్య వెంకటేష్, నాయబు వెంకట్రావు, వెంకటేశ్వర్ రెడ్డి, స్వీట్ హౌస్ రాజు, సత్యపల్ రెడ్డి, జహంగీర్,శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.