దిగ్గజ టెక్ సంస్థ గూగుల్‌తో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించడం మీ కలయితే.. ఆ కలను నిజం చేసుకునే టైమొచ్చేసింది. అదీ ఏటా రూ.10లక్షల దాకా జీతంతో. ఈ టెక్ సంస్థ ఇప్పుడు వింటర్ ఇంటర్న్‌షిప్-2024 పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ లక్కీ ఛాన్స్ దక్కించుకునేందుకు అర్హులు. ఈ కార్యక్రమానికి ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్, బెంగళూరులో పనిచేయాల్సి ఉంటుంది. ఆర్నెళ్ల నుంచి 24 నెలల దాకా కాంట్రాక్టు ద్వారా జరిగే ఈ ఇంటర్న్‌షిప్‌లో భాగంగా నెలకు రూ.84వేలు స్టైఫండ్‌గా గూగుల్ అందిస్తుంది.
అర్హత: బీఎస్సీ కంప్యూటర్స్, ఎంఎస్సీ కంప్యూటర్స్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు. బీటెక్ విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు.
చివరి తేదీ: దరఖాస్తుకు అక్టోబరు ఒకటి చివరి తేదీ.
ఏం చేయాలంటే..?
- దరఖాస్తు చేసుకునే ముందు క్రియేటివ్ గా ఓ రెజ్యూమ్ తయారుచేసుకోవాలి. మీకు కోడింగ్, కంప్యూటర్‌పై ఉన్న నైపుణ్యాల్ని తప్పకుండా జత చేయాలి.
- https://cse.noticebard.com/internships/google-winter-internship-2024/ ఈ లింకులోకి వెళ్లి రెజ్యూమ్ సెక్షన్‌లో మీ రెజ్యూమ్‌ని అప్‌లోడ్ చేయాలి.
- హయ్యర్ స్టడీస్ విభాగంలో అవసరమైన విషయాలు ఫిల్ చేయాలి. ఆ తరవాత డిగ్రీ స్టేటస్ వద్ద నౌ అటెండింగ్ ఎంచుకోవాలి.
- తర్వాత ఇంగ్లీష్ ట్రాన్స్‌క్రిప్ట్‌ను అప్‌లోడ్ చేసి, అప్లికేషన్ సబ్‌మిట్ చేయాలి.