తెలంగాణ: ఈ నెల 27న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం టెట్ పరీక్ష నిర్వహించగా… పేపర్-1కు 2,26,744 మంది, పేపర్-2కు 1,89,963 మంది హాజరయ్యారు. ఈ నెల 19, 20 తేదీల్లో ప్రైమరీ కీ విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆ కీపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం తుది కీని విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా సిరిసిల్లా జిల్లాలో ఓ సెంటర్‌లో ఓఎంఆర్ షీట్లపై అభ్యర్థులు వైట్‌నర్ ఉపయోగించగా వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటామని.. అభ్యర్థులు ఆందోళన చెందవద్దని అధికారులు స్పష్టం చేశారు. పలు కేంద్రాల్లో పరీక్ష నిర్వహణలో జరిగిన తప్పిదాలపై అభ్యర్థులు మండిపడుతున్నారు.
Employement: ఒకేషనల్ కోర్సులతో ఉపాధి!
Mana Enadu:పదో తరగతి తర్వాత త్వరగా స్థిరపడాలనుకుంటే ఇంటర్‌లో ఒకేషనల్ కోర్సులు చేయడం మంచి ఆప్షన్. చదువు పూర్తయిన వెంటనే ఉపాధి పొందడానికి అవకాశం ఉంది. ఒకేషనల్ కోర్సుల్లో ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం ఇస్తారు. అందువల్ల కోర్సు పూర్తయిన వెంటనే ఎలాంటి శిక్షణ…