తెలంగాణ: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ ఇంకో రెండు రోజుల్లో మొదలు కానుంది. ఈనెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రక్రియ అక్టోబరు 21న ముగుస్తుంది. ఆశావహులు ఆన్‌లైన్‌లో tspsc.gov.in లింకు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 20 నుంచి 30 వరకు పరీక్షలు జరగనుండగా, రాష్ట్రవ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఆన్‌లైన్ (సీబీటీ పద్ధతి)లో పరీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 5089 పోస్టులను భర్తీ చేయనుండగా.. దాదాపు 3.6లక్షల మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. ఇటీవలె టెట్ పరీక్ష పూర్తవగా.. డీఎస్సీలో 80శాతం, టెట్‌లో 20శాతం వెయిటేజీని అభ్యర్థులకు లెక్కగట్టనున్నారు.
జిల్లాల వారీగా ఉపాధ్యాయ పోస్టులు: