విజయవాడ: ఐఏఎస్, ఐపీఎస్… ఇతర కేంద్రీయ సర్వీసుల్లో ఉద్యోగాలు ఎంతో మంది యువతీ యువకుల కల. కానీ, ఆ కల నెరవేరేందుకు ఆర్థిక పరిస్థితులు అడ్డుపడి ఇతర ఉద్యోగాలతో సర్దుకుపోతున్న వారు చాలామందే. ఇలాంటి వాళ్లకు ఆర్థికంగా దన్నుగా నిలిచేందుకు, సివిల్స్ వైపు అడుగేయాలనుకున్న వారికి ప్రోత్సాహం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన అభ్యర్థుల్లో యూపీఎస్సీ ప్రిలిమ్స్, మెయిన్స్ ఉత్తీర్ణత సాధించిన వారికి రూ. 50వేల నుంచి రూ.లక్ష దాకా ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో ఈ కొత్త పథకానికి కేబినేట్ ఆమోదం తెలపనుంది. బుధవారం జరుగుతున్న ఏపీ కేబీనేట్ బేటీలో 49 కీలక విషయాలపై చర్చలు జరిగాయి.
ఈ అంశాలకు ఆమోదం..!
ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎస్ బిల్లు అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. దీంతోపాటు ఉద్యోగి రిటైర్డ్ అయిన సమయానికి ఇంటి స్తలం లేని వారికి కచ్చితంగా ఇంటిస్థలం ఉండాలి..ఇది ప్రభుత్వ బాధ్యతగా ఉండటంతో పాటు విరమణ అనంతరం సైతం వారి కుటుంబసభ్యులతో సహా అందరికీ ఆరోగ్యశ్రీ వర్తింపచేయాలని నిర్ణయించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ప్రభుత్వ ఉద్యోగుల కు జిపిఎస్ అమలు ముసాయిదా బిల్లులు, ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లు, జగనన్న ఆరోగ్య సురక్ష, కురుపం ఇంజనీరింగ్ కాలేజీల్లో 50 శాతం సీట్లు గిరిజనులకు కేటాయించే ప్రతిపాదన, ఆంధ్రప్రదేశ్ ఆధార్ సవరణ బిల్లు, పోలవరం ముంపు బాధితులకు 8424 ఇళ్ల నిర్మాణం, అసైన్డ్ భూములు క్రమబద్ధీకరణకు పీఓటీ చట్ట సవరణ, భూదాన్, గ్రామదాన్ చట్ట సవరణ బిల్లు, దేవాదాయ చట్ట సవరణపై కేబినేట్ చర్చించింది.
RajyaSabha: విజయసాయి రాజీనామా.. ఎంపీ సీటు ఆ సీనియర్ నేతకేనా?
రాజ్యసభ సభ్యుడిగా ఉన్న YCP సీనియర్ నేత విజయసాయి రెడ్డి(Vijaya Sai Reddy) తన పదవికి శనివారం రాజీనామా(Resignation) చేశారు. ఆయన పదవీ కాలం 2028 జూన్ 21 వరకూ ఉంది.. అంటే MPగా మరో మూడున్నరేళ్ల పాటు ఆ పదవిలో…