Telangana: అసెంబ్లీలో పెరగనున్న మగువల స్థానాలు

హైదరాబాద్: 33శాతం మహిళ బిల్లు అమలు కావడంతో అసెంబ్లీ స్థానాలలో మహిళల సంఖ్య పెరగబోతుంది. ప్రధానంగా తెలంగాణలో మహిళా రిజర్వేషన్ అమలులోకి వస్తే జూబ్లీహిల్స్,తుంగతుర్తి, ఉప్పల్ మహిళకే కేటాయించనున్నట్లు సమాచారం?!.

చట్టసభల్లో మహిళా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలపై చర్చ నెలకొంది. రాష్ట్రంలో 39-40 స్థానాలు నారీమణులకు కేటాయించే అవకాశం ఉంది. అత్యధిక మహిళా జనాభా ఆధారంగా నియోజకవర్గాల కేటాయింపులు ఉండనున్నట్లు తెలుస్తోంది.

నిర్మల్, ముథోల్, పెద్దపల్లి, మంథని, కరీంనగర్, హుజురాబాద్, సిరిసిల్ల, నిజామాబాద్ అర్బన్, రూరల్ స్థానాలు,జహీరాబాద్, కామారెడ్డి, పటాన్ చెరు, గజ్వేల్, కుత్బుల్లాపూర్, మేడ్చల్, జూబ్లిహిల్స్, నాంపల్లి, కార్వాన్, యాకత్ పురా, శేరిలింగంపల్లి, చేవెళ్ల, మహబూబ్ నగర్, మక్తల్, వనపర్తి, గద్వాల్, హుజూర్ నగర్, దేవరకొండ, తుంగతుర్తి, మునుగోడు, వర్ధన్నపేట, స్టేషన్ ఘన్పూర్, ములుగు, పినపాక, ఇల్లందు, మహబూబాబాద్, సత్తుపల్లి, కొత్తగూడెంతో పాటు మరికొన్ని స్థానాలు మహిళలకు కేటాయించే అవకాశం ఉంది.

ఇప్పటికే అభ్యర్ధులు ప్రకటించిన ప్రధాన పార్టీలు వ్యూహం మర్చాయి.అభ్యర్ధులు ఎంపికలో మళ్ళీ సన్నద్ధం అవుతున్నాయి.

Share post:

Popular