Elon Musk: మస్క్​ దాతృత్వం.. రూ.927 కోట్ల షేర్లు దానం

టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ సంస్థల అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) మరోసారి దాతృత్వాన్ని చాటుకున్నారు. 108 మిలియన్‌ డాలర్లకు పైగా విలువైన టెస్లా (Tesla) షేర్లను ఛారిటీలకు విరాళంగా ఇచ్చారు. $408.3 బిలియన్ల నికర సంపదతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన మస్క్​కు టెస్లాలో సంస్థలో 12.8శాతం వాటాలు ఉన్నాయి. కాగా ఆ వాటాల్లో నుంచి 2,68,000 షేర్లను న్యూ ఇయర్​కు ముందు పలు ఛారిటీలకు దానంగా ఇచ్చేశారు.

గోప్యంగా స్వచ్ఛంద సంస్థల పేర్లు

2,68,000 షేర్ల విలువ 108.2 మిలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.927 కోట్లు) ఉంటుందని తెలిసింది. 2‌‌024 ముగింపు పన్ను ప్రణాళికలో ఈ షేర్లను మస్క్‌ బదిలీ చేసినట్లు కంపెనీ తమ ఫైలింగ్‌లో పేర్కొంది. స్టాక్‌ను విక్రయించే ఉద్దేశ్యం మస్క్​కు (Elon Musk) లేదని పేర్కొంది. అయితే, విరాళం పొందిన స్వచ్ఛంద సంస్థల వివరాలు మాత్రం వెల్లడించలేదని రాయిటర్స్ నివేదించింది.

గతంలోనూ విరాళం

ఎలాన్​ మస్క్‌ గతంలోనూ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. 2021లో మస్క్‌ ఫౌండేషన్‌కు 5.74 బిలియన్‌ డాలర్లు విరాళమిచ్చారు. ఈ సంస్థకు ఆయనే అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. పలు ఛారిటీ కార్యక్రమాలతో పాటు మానవాళికి ప్రయోజనం చేకూర్చేలా ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ను (artificial intelligence) అందుబాటులోకి తీసుకురావడంపై ఇది పనిచేస్తోంది.

Related Posts

Gold & Silver Price: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు (Gold Rate) భారీగా పెరిగాయి. అంతర్జాతీయ, జియోపాలిటికల్ పరిణామాల నేపథ్యంలో ఈ పెరుగుదల నమోదైంది. ఇండియా-అమెరికా మధ్య టారిఫ్‌ల ప్రభావం, మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, డాలర్‌(Dollar) క్షీణత వంటి కారణాలతో అంతర్జాతీయంగా పసిడి, వెండి ధరల (Gold…

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. కేజీ వెండి రేటెంతంటే?

బంగారం ధరలు(Gold Rates) రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌(Hyderabad Bullion Market)లో ఈ రోజు (ఆగస్టు 29) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.710 పెరిగి రూ.1,03,310కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *