
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రభుత్వం తీసుకొచ్చిన ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్లు (Big Beautiful Bill)’ను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ ట్రంప్ తీసుకొచ్చిన బిల్ చట్టరూపం దాల్చితే కొత్త పార్టీపెడతానని ప్రకటించారు కూడా. అన్నట్లే మస్క్ అదే చేశారు. అమెరికాలో కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన తన కొత్త రాజకీయ పార్టీ “ది అమెరికా పార్టీ(The Americ Party)”ని అనౌన్స్ చేశారు. ఇది అమెరికా రాజకీయ రంగంలో సంచలనం సృష్టించింది.
అమెరికా అనేది ఒక ఆలోచన, ఒక ఉద్యమం: మస్క్
మస్క్, ఎప్పటిలాగే సంప్రదాయ రాజకీయ ధోరణులకు విరుద్ధంగా, ఈ పార్టీ ద్వారా అమెరికన్ పౌరుల(American citizens)కు స్వేఛ్చాధారిత పాలనను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మస్క్ తెలిపారు. ఈ పార్టీ ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశం, రాజకీయ ప్రోద్బలాన్ని తగ్గించి, సమస్యలకు ఆచరణీయ పరిష్కారాలను అందించడమని మస్క్ తెలిపారు. “ది అమెరికా పార్టీ” ప్రధాన లక్ష్యాల్లో ఆర్థిక స్థిరత్వం, సాంకేతిక ఆవిష్కరణలకు ప్రోత్సాహం, ప్రభుత్వ సామర్థ్యాన్ని పెంచడం వంటివి ఉన్నాయి. మస్క్ తన సామాజిక మాధ్యమ వేదిక Xలో ఈ పార్టీ గురించి ప్రకటన చేస్తూ, “అమెరికా అనేది ఒక ఆలోచన, ఒక ఉద్యమం. మనం కలిసి సత్యం, న్యాయం కోసం పనిచేయాలి” అని పిలుపునిచ్చారు.
By a factor of 2 to 1, you want a new political party and you shall have it!
When it comes to bankrupting our country with waste & graft, we live in a one-party system, not a democracy.
Today, the America Party is formed to give you back your freedom. https://t.co/9K8AD04QQN
— Elon Musk (@elonmusk) July 5, 2025
మస్క్ పార్టీపై రాజకీయ ప్రముఖులు ఏమంటున్నారంటే?
ఈ పార్టీ రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల నుంచి భిన్నంగా, డేటా ఆధారిత నిర్ణయాలతోపాటు స్వేచ్ఛా విలువలను ప్రోత్సహించే లక్ష్యాన్ని కలిగి ఉందని యూఎస్ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మస్క్ ఆర్థిక వనరులు, సామాజిక మాధ్యమ ప్రభావం ఈ పార్టీని ఒక శక్తిమంతమైన పార్టీగా మార్చవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే, స్థాపిత రాజకీయ వ్యవస్థలతో పోటీపడటం సవాలుగా ఉంటుందని కొందరు హెచ్చరిస్తున్నారు.