జమ్మూకశ్మీర్(Jammu & Kashmir)లోని పూంచ్(Poonch) ప్రాంతంలో బుధవారం ఉదయం ఎన్‌కౌంటర్ (Encounter) చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదుల(Terrorists)ను భద్రతా బలగాలు(Security Forces) మట్టుబెట్టాయి. పహల్గాం(Pahalgam) దాడిలో పాల్గొన్న ముగ్గురు ముష్కరులను ఆపరేషన్ మహాదేవ్(Operation Mahadev) ద్వారా హత మార్చిన రోజుల వ్యవధిలోనే ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకోవడం గమనార్హం. ఎదురుకాల్పుల్లో మృతిచెందిన వారిని లష్కరే తోయిబా(Lashkar-e-Taiba)కు చెందిన ఉగ్రవాదులుగా భావిస్తున్నారు.
అనుమానిత కదలికలతో కాల్పులు
పూంచ్ ప్రాంతం(Poonch Sector)లో ఈ ఉదయం అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తుల కదలికలను గుర్తించినట్లు భద్రతా బలగాలు పేర్కొన్నాయి. ‘‘పూంచ్ సెక్టార్‌లోని జెన్ ప్రాంతంలో కంచె వెంబడి ఇద్దరు వ్యక్తుల అనుమానిత కదలికలను దళాలు గుర్తించాయి. ఆ వెంటనే కాల్పులు జరిగాయి. వారి వద్ద రెండు వెపన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది’’ అని ఆర్మీకి చెందిన వైట్ నైట్ కార్ప్స్ Xలో వెల్లడించింది. భారత్(India)లోకి చొరబడేందుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టినట్లు J&K డీజీపీ నలీన్ ప్రభాత్ ధ్రువీకరించారు.
#OperationShivShakti launched in #Kashmir..
2 Pak Sponsored #Terrorists of LeT sent to 72 Hoors by #IndianArmy in Poonch.#Poonch #Encounter #TejRan #DimpleYadav #earthquake #Tsunami pic.twitter.com/O51XDEzmV0— Sunaina Bhola (@sunaina_bhola) July 30, 2025






