న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ (ENG vs NZ) క్రికెట్ జట్టు గొప్పగా ఆడుతోంది. తొలి టెస్టులో ఆతిథ్య జట్టును 8 వికెట్ల తేడాతో ఓడించిన ఇంగ్లాండ్ (England) జట్టు.. రెండో టెస్టులో తిరుగులేని ఆధిక్యం సాధించింది. ఈ క్రమంలోనే ఓ అరుదైన ఘనత సాధించింది. క్రికెట్ పుట్టినిల్లుగా చెప్పుకునే ఇంగ్లాండ్ టెస్టు చరిత్రలో 5 లక్షల రన్స్ చేసిన జట్టుగా రికార్డులకెక్కింది (Highest Runs In Test Cricket). న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఈ ఫీట్‌ను అందుకుంది. మొత్తంగా ఇంగ్లాండ్‌కి ఇది 1082వ టెస్ట్ మ్యాచ్. ఈ జాబితాలో ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా, టీమిండియా ఉన్నాయి. ఆసీస్ జట్టు 4,28,800 పైచిలుకు రన్స్ సాధించింది. ఆ తర్వాత భారత్ 2,78,751 రన్స్‌తో ఉంది.
సెంచరీల్లో కూడా..
ఇక టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు (Highest centuries) చేసిన రికార్డును కూడా ఇంగ్లాండ్ జట్టు కలిగి ఉంది. ఆ జట్టు బ్యాటర్లంతా కలిసి మొత్తంగా 929 సెంచరీలు సాధించారు. ఇక ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ 592 సెంచరీలు నమోదు చేయగా.. భారత బ్యాటర్లు టెస్ట్ క్రికెట్‌లో 552 సెంచరీలు సాధించారు.
సిరీస్‌లో ఇంగ్లాండ్ దూకుడు
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో గెలిచిన ఇంగ్లాండ్.. రెండో టెస్టులోనూ భారీ ఆధిక్యం సాధించింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 280 రన్స్ చేసిన ఇంగ్లాండ్.. కివీస్‌ను 125 రన్స్‌కే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్లు కోల్పోయి 378 రన్స్ చేసింది. మొత్తంగా 533 రన్స్ ఆధిక్యంలో పటిష్ఠ స్థితిలో ఉంది. అద్భుతాలు జరిగితే తప్ప న్యూజిలాండ్‌కు ఓటమి తప్పదు.
500,000 reasons to love England ❤️ pic.twitter.com/yvm1wRogeE
— England Cricket (@englandcricket) December 7, 2024








