లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్(Kennington Oval)లో ఇండియా ఉమెన్స్(India Womens)తో జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్ ఉమెన్స్(England Womens) విజయం సాధించింది. చివరి ఓవర్ వరకూ ఉత్కంఠబరితంగా సాగిన ఈ మ్యాచులో ఇంగ్లండ్ 5 పరుగుల తేడాతే గెలిచింది. ఈ మ్యాచులో ఇంగ్లండ్ నిర్దేశించిన 172 పరుగుల టార్గెట్‌ను భారత్ ఛేదించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 166/5కే పరిమితమై ఐదు పరుగుల తేడాతో ఓడింది. దీంతో ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి T20 సిరీస్ పట్టేయాలని చూసిన భారత్‌కు ఇంగ్లండ్ ఉమెన్స్ అడ్డుకట్ట వేశారు. కాగా 5 మ్యాచుల టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచుల్లో భారత్ గెలిచి 2-0 ఆధిక్యంలో ఉంది.
ఆ జట్టు ఓపెనర్లే కొట్టేశారు..
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 171/9 పరుగులు చేసింది. ఓపెనర్లు సోఫియా డంక్లీ(75), వ్యాట్-హాడ్జ్ (66) ఇద్దరూ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఇక ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో సోఫియా(10) రన్స్ చేయగా.. మిగతా వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి, దీప్తి శర్మ చెరో 3 వికెట్లు తీయగా, శ్రీచరణి రెండు , రాధా యాదవ్ 1 వికెట్ పడగొట్టింది.
మంధాన షెఫాలీ రాణించినా..
అనంతరం 172 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు స్మృతి మంధాన (67), షెఫాలీ (47) తొలి వికెట్‌కు 85 పరుగులు జోడించి గట్టి పునాది వేశారు. ఆ తర్వాత జెమీమా రోడ్రిగ్స్(20), హర్మన్ ప్రీత్ కౌర్ (23)తో సహా స్మృతి ఔటవడంతో భారత్ ఒత్తిడిలోకి వెళ్లింది. చివరి ఓవర్లో 12 పరుగులు అవసరం కాగా భారత్ కేవలం 6 రన్స్ చేసి ఒక వికెట్ కోల్పోయింది. దీంతో ఇంగ్లండ్ జట్టు 5 పరుగుల తేడాతో నెగ్గింది. ఆతిథ్య జట్టు బౌలర్లలో లారెన్ బెల్ 2 వికెట్లు తీసింది. ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ స్కివర్-బ్రంట్ గాయం కారణంగా ఆడకపోగా, టామీ బ్యూమాంట్ నాయకత్వం వహించింది. ఇరుజట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ ఈనెల 9న మాంచెస్టర్‌లో జరగనుంది.
I cannot state how much I LOVE 🥰 this game!!! #ENGvIND #WomensCricket https://t.co/iWV3hgETgS
— caz wotton (@cazabelle1983) July 4, 2025






