తెలంగాణలో ప్రతి సమస్య భూమితోనే ముడిపడి ఉంది: సీఎం రేవంత్‌

తెలంగాణ శాసనసభ సమావేశాలు (Telangana Assembly Sessions 2024) ఆరోరోజు వాడివేడిగా సాగుతున్నాయి. ఇవాళ్టి సభలో ఫార్ములా ఈ రేసు వ్యవహారంపై చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడుతూ.. విపక్ష పార్టీ అహంభావంతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. స్పీకర్‌ పట్ల కూడా దారుణంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు.

ప్రతి సమస్య భూమితోనే ముడిపడింది

“తెలంగాణలో ప్రతి సమస్య భూమితోనే ముడిపడి ఉంది. రావి నారాయణ, బద్దం ఎల్లారెడ్డి, మల్లు స్వరాజ్యం వంటి వారు భూపోరాటాలు చేశారు. తెలంగాణలో ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టేది భూమి. భూమిని కాపాడుకునే ప్రయత్నంలో దొడ్డి కొమురయ్య వంటి వారు ప్రాణాలు కోల్పోయారు. సర్వం ఒడ్డి పోరాటాలు చేసి భూములు కాపాడుకున్నారు.

పేదల భూములు రక్షించేందుకే పటేల్‌, పట్వారీ వ్యవస్థ రద్దు చేశారు. భూమి లేని పేదలకు ఇందిరా గాంధీ ప్రభుత్వం భూమి ఇచ్చి ఆత్మగౌరవం నిలబెట్టింది. ఆక్రమణలు తొలగించి రైతుల హక్కులు కాపాడేందుకు గత ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తెచ్చాయి. గత ప్రభుత్వం తెచ్చిన ‘ధరణి (Dharani Portal)’ మాత్రం రైతులను తమ భూములకు దూరం చేసింది.” అని రేవంత్ అన్నారు.

యువరాజు సన్నిహితుడి చేతిలో ధరణి

గత కేసీఆర్ సర్కార్ (KCR Govt) కేటీఆర్ కు సన్నిహితుడైన గాదె శ్రీధర్‌రాజు కంపెనీకి ధరణి పోర్టల్‌ నిర్వహణను అప్పగించిందని..  అవకతవకలకు పాల్పడిన సంస్థకు ధరణి పోర్టల్ బాధ్యతను అప్పగించారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. ధరణి టెండర్‌ దక్కగానే ఈ సంస్థ పేరు, యాజమాన్యం మారిందని.. ఫాల్కన్‌ హెచ్‌బీ అనే ఫిలిప్పీన్‌ కంపెనీ, తర్వాత సింగపూర్‌ కంపెనీ ఇందులోకి వచ్చాయని చెప్పారు. 50 లక్షల మంది రైతులు, వారి భూముల వివరాలను ట్యాక్స్‌ హెవెన్‌ దేశాల కంపెనీల చేతిలో పెట్టారని ఆరోపించారు.

అహంకారంతో విపక్ష పార్టీ 

విపక్ష పార్టీ అహంభావంతో, అహంకారంతో  వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ అన్నారు. సభా మర్యాదలను ఉల్లంఘించి సభాపతి (Telangana Speaker)పైనే దాడి చేసే ధోరణిలో చర్చను అడ్డుకోవడానికి ప్రయత్నించిందని ఆరోపించాచరు. రెచ్చగొట్టడం ద్వారా భూ భారతి బిల్లు (Bhu Bharati Bill)పై చర్చను పక్కదోవ పట్టించాలని ప్రయత్నించినా స్పీకర్ చాలా ఓర్పుతో వ్యవహరించారని ప్రశంసించారు. తెలంగాణ రైతాంగానికి ఉపయోగపడే కీలకమైన, ముఖ్యమైన బిల్లుపై చర్చ జరిగే విధంగా కృషి చేసిన స్పీకర్ కు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *