ఏసీబీ కేసు పెట్టారు.. కానీ అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పలేదు?: కేటీఆర్‌ లాయర్

హైదరాబాద్ ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ (Hyderabad Formula E Race) వ్యవహారంలో తెలంగాణ ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR ACB Case) హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై తాజాగా హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కేటీఆర్‌ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సుందరం, ప్రభాకర్‌రావు, గండ్ర మోహన్‌రావు హైకోర్టులో వాదనలు వినిపించారు.

విచారణ లేకుండా కేసు పెట్టారు

ఈ సందర్భంగా కేటీఆర్ తరఫు లాయర్ మాట్లాడుతూ.. అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని.. ముఖ్యంగా 13(1)(a) సెక్షన్‌ వర్తించదని అన్నారు. ఎన్నికల కోడ్‌ (Election Code) ఉల్లంఘించారని అనేందుకు ఆధారాలు లేవన్న ఆయన.. 14 నెలల తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని.. అది కూడా ప్రాథమిక విచారణ కూడా లేకుండా కేసు పెట్టారని కోర్టుకు తెలిపారు. కార్‌ రేస్‌ నిర్వహణకు 2022 అక్టోబరు 25న ఒప్పందం జరిగితే.. సీజన్‌ 10 నిర్వహణకు స్పాన్సర్‌ వెనక్కి తగ్గారని వెల్లడించారు.

ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యం

ఇక రేస్‌ నిర్వహణలో ఇబ్బందుల నివారణకే ప్రభుత్వం రంగంలోకి దిగిందని.. ఇబ్బందులు రాకూడదనే హెచ్‌ఎండీఏ (HMDA) చెల్లింపులు చేసిందని వివరించారు. కార్‌ రేసింగ్‌ ఒప్పందాన్ని ఉల్లంఘించిన కొత్త సర్కార్.. డబ్బు చెల్లించలేదని అందువల్లే ఒప్పందం రద్దయిందని కేటీఆర్ తరఫు లాయర్ తెలిపారు. ఈ వ్యవహారంలో నిధులు దుర్వినియోగమయ్యాయని అభియోగాలు మోపుతున్న ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్‌ నమోదులో ఆలస్యానికి కారణాలు చెప్పలేదని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధిపై కేసుకు ముందు ప్రాథమిక విచారణ చేయాలని వ్యాఖ్యానించారు.

అవినీతి ఎక్కడ జరిగింది?

18వ తేదీన ఫిర్యాదు అందగానే.. 19న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని కోర్టుకు వివరించారు. కేటీఆర్‌ స్పెక్యులేషన్‌ చేసినట్టు ఎక్కడా పేర్కొనలేదని.. అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పలేదు అన్నారు. అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పకుండా.. అవినీతి నిరోధక చట్టం కింద కేసు పెట్టడమేంటో అర్థం కావడం లేదు’’ అని కేటీఆర్‌ తరఫు న్యాయవాది సుందరం హైకోర్టు (Telangana High Court)లో వాదనలు వినిపించారు. ప్రాథమిక దర్యాప్తు జరపకుండానే కేసు రిజిస్టర్‌ చేయడం చట్ట విరుద్ధమని.. ఫార్ములా ఈ రేస్‌ కోసం నిర్వాహకులకు నిధులు చెల్లిస్తే కేటీఆర్‌పై ఎందుకు కేసు పెట్టారని నిలదీశారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *