
గుంటూరు జిల్లాకు చెందిన YCP నాయకుడు, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్(Ex MP Nandigam Suresh)కు ఎట్టకేలకు రిలీఫ్ దక్కింది. గత 145 రోజులుగా జైల్లోనే ఉన్న నందిగం తాజాగా బుధవారం గుంటూరు జిల్లా జైలు(Guntur District Jail) నుంచి బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే.. ఆయన వెంటనే కాలర్ బోన్ చికిత్స నిమిత్తం విజయవాడకు తరలి వెళ్లారు. గత కొన్నాళ్లుగా నందిగం కాలర్ బోన్ సమస్య(Collar bone problem)తో బాధపడుతున్నారు. కాగా గతంలో ఓ నిర్మాణం విషయంలో మాల-మాదిగ సామాజిక వర్గాల కుటుంబాల మధ్య వివాదంలో గొడవలు చెలరేగి మరియమ్మ అనే మహిళ చనిపోయింది. ఈ ఘటనలో ఆయనపై కేసు నమోదై జైలుకెళ్లారు.
అనారోగ్యం కారణంగానే బెయిల్!
ఇది YCP హయాంలోనే జరిగినా.. కేసు నమోదు చేసినా.. పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చాక.. మరియమ్మ కుమారుడు నారా లోకేశ్(Nara Lokesh)ను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు. నందిగంను అరెస్టు చేసి జిల్లా జైలుకు తరలించారు. ఇక, తనపై కేసు కొట్టేయాలంటూ.. ఆయన హైకోర్టు సుప్రీంకోర్టు(Supreme Court) వరకు వెళ్లినా.. నేర చరిత్రను సొంతం చేసుకున్నారంటూ.. న్యాయస్థానాలు వ్యాఖ్యానించారు. చివరకు తాజాగా 5 నెలల అనంతరం.. అనారోగ్య కారణాలతో బెయిల్(Bail on grounds of ill health) తెచ్చుకున్నారు.
మరో కేసులో తాజాగా నోటీసులు
అయితే.. తాజాగా విజయవాడ కృష్ణ లంక పోలీసులు(Krishna Lanka Police) మరో కేసును తెరమీదికి తెచ్చారు. YCP హయాంలో నమోదైన ఈ కేసులో తాజాగా నందిగం సురేష్‌కు నోటీసులు ఇవ్వనున్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. అప్పట్లో నందిగం అనుచరులు మద్యం తాగి విజయవాడ బస్టాండ్ వద్ద హల్చల్ చేశారు. ఈ క్రమంలో వారిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలిసిన అప్పటి ఎంపీ సురేష్ తెల్లవారు జామున స్టేషన్‌కు వచ్చి.. పోలీసులను దుర్భాషలాడారని.. పోలీసుల అదుపులో ఉన్న తన అనుచరులను బలవంతంగా తీసుకువెళ్లారన్నది అభియోగం. ఈ కేసు తాజాగా తెరమీదికి వచ్చింది. దీంతో నందిగం మరోసారి జైలుకు వెళ్లక తప్పదా? అనే చర్చ మొదలైంది.