టీమ్ఇండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప (Robin Uthappa) వివాదంలో చిక్కుకున్నాడు. ఉతప్పకు సంబంధించిన కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ నిధులు చెల్లించలేదని అతడిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. అతడిపై అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. బెంగళూరుకు చెందిన సెంటారస్ లైఫ్‌స్టైల్ బ్రాండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి రాబిన్ ఉతప్ప (Uthappa) డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల నుంచి పీఎఫ్‌ను కట్ చేసినప్పటికీ వాటిని ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో జమ చేయలేదు.
27 లోగా బకాయిలు చెల్లించాలి
మొత్తంగా దాదాపు రూ.23,36,602ను ఉతప్ప తన ఉద్యోగుల ఖాతాలో జమ చేయకుండా మోసం చేశారని (PF settlement case on Uthappa) తేలింది. ఈ వ్యవహారంలో పీఎఫ్ రీజనల్ కమిషనర్ సదాక్షరి గోపాల్ రెడ్డి ఉతప్పకు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులు అందజేయడానికి డిసెంబరు 4న పులకేశినగర్‌లోని ఉతప్ప ఇంటికి వెళ్లారు. అక్కడ అతడు లేకపోవడంతో దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని పీఎఫ్ ప్రాంతీయ కమిషనర్ స్థానిక పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలోనే ఉతప్పపై అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. డిసెంబరు 27లోగా అతడు బకాయిలు చెల్లించాలని లేదంటే అరెస్టు తప్పదని వారెంట్‌లో పేర్కొన్నారు.
టీమ్ఇండియా తరఫున 59 మ్యాచ్‌లు
భారత్ తరఫున 59 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రాబిన్ ఉతప్ప.. ఐపీఎల్లో ధిల్లీ, కోల్‌కతా, చెన్నై జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఓపెనర్‌గా పలు మ్యాచ్‌లలో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత వ్యాఖ్యాతగానూ మారాడు.








