లెక్క తప్పిన ఎగ్జిట్ పోల్స్.. హర్యానాలో అంచనాలన్నీ ఫెయిల్

Mana Enadu : ఏ ఎన్నికలు జరిగినా ఎగ్జిట్ పోల్స్(Exit Polls 2024) పైనే అందరి దృష్టి నెలకొంటుంది. కాస్త అటూ ఇటూ అయినా దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే ఎన్నికల ఫలితాలుగా వెల్లడవుతాయి. ఓటర్ల అభిప్రాయాన్ని తీసుకుని పలు సర్వే సంస్థలు ముందస్తుగానే ఏ పార్టీ, కూటమి విజయం సాధిస్తుందని అంచనా వేసే ఈ పోల్స్ అంచనాలు కొన్నిసార్లు తలకిందులు కూడా అయ్యే అవకాశాలున్నాయి.

తలకిందులైన ఎగ్జిట్ పోల్స్

ఓటర్ల నాడిని పసిగట్టేవిగా ప్రచారం చేసుకునే ఎగ్జిట్‌ పోల్స్‌ తాజాగా మరోమారు దెబ్బతిన్నాయి. ఇటీవలి ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో(Parliament Election Results) చతికిలపడ్డట్లే తాజాగా హర్యానా, జమ్ముకశ్మీర్‌ విషయంలోనూ తలకిందులయ్యాయి.

హర్యానాలో బీజేపీ విజయఢంకా

మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్న హర్యానా(haryana Results 2024)లో కాంగ్రెస్‌ 50కు పైగా స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాకు వచ్చాయి. బీజేపీ హ్యాట్రిక్​కు ఇక బ్రేక్ పడినట్లేనని.. మోదీ అధ్యాయానికి త్వరలోనే ముగింపు కార్డు పడబోతుందనే టాక్ నడిచింది. కానీ ఫలితాలు చూస్తే బీజేపీ 50 మార్కుకు చేరువై వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రెడీ అయింది. కాంగ్రెస్‌ 37 సీట్లతోనే సరిపెట్టుకుంది.

ఇంతకు ముందు ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ దాదాపు అన్ని ఎగ్జిట్‌పోల్స్‌ కాంగ్రెస్‌ నెగ్గుతుందని చెప్పిన విషయం తెలిసిందే. కానీ చివరకు బీజేపీ విజయఢంకా మోగించింది. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 350కు పైగా సీట్లతో ఆధిక్యం సాధిస్తుందని అంచనా వేశాయి. కానీ 240 స్థానాలకు పరిమితమైన కమలం పార్టీ మెజారిటీకి అవసరమైన సీట్లను (272) కూడా సొంతంగా సాధించలేకపోయిన సంగతి తెలిసిందే.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *