Mana Enadu : అల్లు అర్జున్ (Allu Arjun) కథానాయకుడిగా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప: ది రైజ్’కు కొనసాగింపుగా వచ్చిన చిత్రం ‘పుష్ప2: ది రూల్ (Pushpa 2 : The Rule)’. ఈసారి నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్.. ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అంటూ ప్రేక్షకుల్ని ఊరిస్తూ వచ్చిన పుష్పరాజ్ రిలీజ్ కు ముందు పెట్టుకున్న అంచనాలను మించి థియేటర్లోలో పూనకాలు తెప్పిస్తున్నాడు. డిసెంబరు 5వ తేదీన విడుదలైన ఈ చిత్రం ప్రభంజనం సృష్టిస్తోంది.
జాతర సీన్ కు థియేటర్లో పూనకాలు
థియేటర్లో పుష్ప-2 సినిమాను చూస్తున్న ప్రేక్షకులు కేరింతలు కొడుతున్నారు. ముఖ్యంగా ఈ మూవీలోని జాతర ఎపిసోడ్ (Pushpa 2 Jatara Scene) అద్భుతమంటూ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇక ఈ సీన్ లో బన్నీ యాక్టింగ్ అదుర్స్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అల్లు అర్జున్ ఎందుకు జాతీయ అవార్డుకు అర్హుడో ఈ ఒక్క సీన్ చూస్తే అర్థమైపోతుందని అంటున్నారు. గంగమ్మతల్లి అవతారంలో బన్నీ తన నట విశ్వరూపంతో గూస్‌బంప్స్ తెప్పించాడని ఈ సీన్ ను మరో పదేళ్ల వరకూ ప్రేక్షకులు గుర్తుంచుకుంటారని చెబుతున్నారు.
బన్నీకి ఆడియెన్స్ సలామ్
జాతర సీక్వెన్స్ కి ఫ్యాన్స్ రియాక్షన్ చూస్తూ మురిసిపోయిన @alluarjunpic.twitter.com/T7HEs4l4f1
— Rajesh Manne (@rajeshmanne1) December 4, 2024
అయితే అల్లు అర్జున్ (Allu Arjun Sandhya Theater) ‘పుష్ప2’ ప్రీమియర్‌ను హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో ఫ్యాన్స్‌తో కలిసి చూసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం చూస్తూ ఫ్యాన్స్ చేసిన హంగామా చూసి బన్నీ మురిసిపోయాడు. ఇక జాతర ఎపిసోడ్ వచ్చిన సమయంలో ఆడియన్స్ రియాక్షన్ చూసి సర్ ప్రైజ్ అయ్యాడు. ఈ సీన్ లో తన యాక్టింగ్ చూసి ఆడియెన్స్ బన్నీకి సలాం కొట్టగా అల్లు అర్జున్ విజయోత్సహంతో ఆనందం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
పుష్ప-2 స్క్రీనింగ్ లో విషాదం
Blockbuster kottesaam anna ❤️
Love you @alluarjun #Pushpa2TheRule #Pushpa2 pic.twitter.com/lAX2YcmZ1j
— AlluBabloo Mithun (@allubabloo18) December 4, 2024
మరోవైపు పుష్ప-2 బెనిఫిట్ షో (Pushpa 2 Woman Death) కోసం సంధ్య థియేటర్ వద్దకు బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో వచ్చిన అల్లు అర్జున్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. వారిని నిలువరించేందుకు పోలీసులు లాఠీ ఛార్జి చేయడంతో కిందపడిపోయి తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.






