
విద్యార్థులకు(Students) సెలవులు(Holidays) అనగానే పండుగ ఎగిరి గంతేస్తారు. తరగతుల ఒత్తిడిలో ఉన్న పిల్లలకు ఒక్క రోజైనా రిలీఫ్ దొరికితే చాలు ఆనందోత్సాహాలు మొదలవుతాయి. అలాంటిది వరుసగా సెలవులు వస్తున్నాయంటే.. ఆ ఆనందం మరింత రెట్టింపవుతుంది. ఇక జూలై చివరిలో ఉన్నాం. వచ్చే ఆగస్ట్ నెలలో పండుగలు (Festival Time Holidays in August) ఉన్నాయి. ఈ సందర్బంగా తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ ఉద్యోగులకు వరుస సెలవులు వచ్చేస్తున్నాయి.
ఆగస్ట్ 3 ఆదివారం ప్రతి వారంలా సెలవు. ఆగస్ట్ 8 నాడు వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సెలవు. ఆగస్ట్ 9 శనివారం నెలలో రెండో శనివారం కావడంతో సెలవు. అదే రోజున రాఖీ పౌర్ణమి కూడా ఉండటంతో మరికొందరికి సెలవు ఖాయం. ఆ వెంటనే ఆగస్ట్ 10 ఆదివారం.
ఆగస్ట్ 11 నుంచి 14 వరకు తరగతులు ఉన్నా, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్కూల్ కార్యక్రమాలే ఉంటాయి. ఈ నాలుగు రోజులు పిల్లలు రిహార్సల్స్, ఆటల పోటీల్లో బిజీగా ఉంటారు. తరగతులు పెద్దగా జరగవు. ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం జాతీయ సెలవు.
ఆగస్ట్ 16 కృష్ణాష్టమి. తెలుగు రాష్ట్రాల్లో పండుగను ఘనంగా జరుపుకుంటారు. స్కూళ్లు, కళాశాలలకు సెలవు ఉండే అవకాశం ఉంటుంది. ఆగస్ట్ 17 మరో ఆదివారం. ఇలా చూస్తే, ఆగస్ట్ మొదటి పక్షంలో విద్యార్థులకు దాదాపు 6 నుంచి 7 రోజులు పూర్తిస్థాయి సెలవులే.