Nano Ev: సరికొత్త లుక్‌తో టాటా నానో EV, 250 కి.మీ రేంజ్.. ధర చాలా తక్కువ గురూ..!

ఆటోమొబైల్ కంపెనీ(Automobile Compani) టాటా మోటార్స్(Tata Moters).. బడ్జెట్ కారైన నానో(Nano Car)ను కొత్త లుక్‌తో, అప్గ్రేడెడ్ ఫీచర్లతో మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్‌ 2024 చివర్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ సారి నానో స్టైలిష్ డిజైన్, 40 కిలోమీటర్ల మైలేజ్‌తో పాటు 624 సీసీ పెట్రోల్ ఇంజన్, 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గియర్లతో అందుబాటులోకి రానుంది.

ఇందులో LED హెడ్‌ల్యాంప్స్, 7 అంగుళాల టచ్‌స్క్రీన్, నాలుగు ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, సన్‌రూఫ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉండనున్నాయి. దీని ప్రారంభ ధర రూ.1.45 లక్షలుగా ఉండొచ్చని అంచనా. కేవలం రూ.1,000 EMIతో ఈ కారును సొంతం చేసుకునే అవకాశముందన్న టాటా వర్గాల మాట.

ఇంతకే కాదు, టాటా నానోను ఎలక్ట్రిక్(Tata Nano Electric) వేరియంట్‌లో కూడా విడుదల చేయాలన్న యోచనలో కంపెనీ ఉంది. నానో EV వర్షన్ ఫుల్ చార్జ్‌లో 250 కిమీ వరకు రేంజ్ ఇస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ కారు 17kWh బ్యాటరీ, 3.3kW AC ఛార్జర్, 2 ఎయిర్‌బ్యాగ్స్, R12 టైర్లు, మ్యూజిక్ సిస్టమ్, పార్కింగ్ సెన్సార్లు, రేర్ వ్యూ కెమెరా, పవర్ విండోస్ వంటి ఉపయోగకరమైన ఫీచర్లతో వస్తుందట.

ఈవీ వేరియంట్ బేసిక్ మోడల్ ధర సుమారు ₹5 లక్షలుగా ఉండొచ్చని, పూర్తి ఫీచర్లతో కూడిన వేరియంట్లు ₹8 లక్షల వరకు ఉండవచ్చని ఆటోమొబైల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకప్పుడు లక్ష రూపాయల కారు పేరిట సంచలనం సృష్టించిన నానో, ఈసారి ట్రెండీ లుక్, టెక్ ఫీచర్లతో మరింత ఆకర్షణీయంగా మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *