ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో రిస్క్ లేకుండా స్థిర ఆదాయం అందించే పథకాలను ఎన్నుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్(Post Office Scheme) ద్వారా అందుబాటులో ఉన్న మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్(Monthly Income Scheme) (MIS) వైపు పెట్టుబడిదారులు మళ్లుతున్నారు. ఈ స్కీమ్ ద్వారా నెలనెలా ఆదాయం రావడంతో అనేకమంది దీన్నిఒక ఆప్షన్‌గా భావిస్తున్నారు.
ఈ స్కీమ్‌లో ఏముంది?
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో కేవలం రూ.1,000తో ఖాతా ప్రారంభించవచ్చు. సింగిల్ అకౌంట్‌కు గరిష్టంగా రూ.9 లక్షలు, జాయింట్(Couples) అకౌంట్‌కు రూ.15 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. ప్రస్తుత వడ్డీ రేటు 7.4% వార్షికంగా ఉంది. వడ్డీని నెలకు ఒకసారి మీ ఖాతాలో జమ చేస్తారు.
వడ్డీ లెక్క ఎలా ఉంటుంది?
రూ.15 లక్షల జాయింట్ డిపాజిట్‌పై సంవత్సరానికి దాదాపు రూ.1.11 లక్షలు వడ్డీ లభిస్తుంది. అంటే నెలకు రూ.9,250 స్థిర ఆదాయం వస్తుంది. సింగిల్ అకౌంట్‌లో రూ.9 లక్షల డిపాజిట్‌పై నెలకు రూ.5,550 వడ్డీ వస్తుంది.
పిల్లల పేరు మీద ఖాతా తెరవొచ్చా?
అవును. 10 ఏళ్లకు పైబడిన పిల్లల పేరుతో కూడా ఈ అకౌంట్ తెరవొచ్చు. విద్య, ఇతర ఖర్చులకు నెలనెలా వచ్చే వడ్డీ ఉపయోగపడుతుంది. వివాహితులు లేదా రిటైర్డ్ వ్యక్తులకు ఇది ఆదాయ నిధిగా ఉపయోగపడుతుంది.
ఈ స్కీమ్ కాలవ్యవధి?
ఈ స్కీమ్ 5 ఏళ్ల కాలవ్యవధితో వస్తుంది. కావాలంటే మరో 5 ఏళ్లు పొడిగించవచ్చు. ముఖ్యంగా తక్కువ రిస్క్, స్థిర ఆదాయం కోరేవారికి ఇది ఉత్తమమైన ఎంపికగా ఉంటుంది. ఖాతా ప్రారంభించేముందు నిబంధనలు, వడ్డీ వివరాలు పూర్తిగా తెలుసుకోవడం మంచిది.






