ఇదో క్రూరమైన చర్య.. ప్రతీకారం తీర్చుకోవాల్సిందే.. ఉగ్రదాడిని ఖండించిన సెలబ్రిటీలు

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం (Pahalgam Terror attack)లో మంగళవారం రోజున పర్యటకులపై ఉగ్రవాదులు తెగబడ్డారు. ప్రకృతి అందాలను చూసి పరవశిస్తోన్న పర్యటకులపై సైనిక దుస్తుల్లో వచ్చిన టెర్రరిస్టులు పాశవికంగా దాడి చేశారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 28 మందిని పొట్టన పెట్టకున్నారు. ఈ పెనువిషాదాన్ని యావత్ భారతావని ఖండిస్తోంది. ఇది ఉగ్రవాదుల పిరికిపంద చర్యగా అభివర్ణిస్తోంది. ఈ ఘటనపై పలువురు  సినీప్రముఖులు స్పందిస్తున్నారు.

ఇదో క్రూరమైన చర్య

ఉగ్రదాడి ఘటనపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi).. 28 మంది అమాయకులను బలిగొన్న దారుణమైన ఈ దాడి హృదయ విదారకమైనదని అన్నారు. ఇది క్షమించరాని క్రూరమైన చర్యగా అభివర్ణించిన ఆయన.. మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. మరోవైపు ఈ పెనువిషాదంపై ఎన్టీఆర్ (NTR On Terror Attack) స్పందించారు. బాధితులను చూస్తుంటే తన గుండె బరువెక్కుతోందని ఆవేదన చెందారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ప్రతీకారం తీర్చుకోవాల్సిందే

ఇది క్షమించరాని చర్య అని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt) అన్నారు. ఈ ఉగ్ర చర్యపై అందరూ మౌనం వీడాలని.. వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని పేర్కొన్నారు. మరో నటుడు అక్షయ్ కుమార్ స్పందిస్తూ.. ఈ దాడి భయంకరమైనదని.. అమాయకులను చంపడం చాలా దారుణమని అన్నారు. మృతుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నానని తెలిపారు. టెర్రర్ అటాక్ ను నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఖండించింది. సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులు జరపడం అన్యాయం అని పేర్కొంది. ఇలాంటి అనాగరిక చర్యల వల్ల వచ్చే కోపాన్ని అణచివేయలేకపోతున్నానని.. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నానని తెలిపింది.

ఇదో పిరికిపంద ఉగ్రవాద చర్య

ఇక ఈ ఘటనపై అల్లు అర్జున్ (Allu Arjun) స్పందిస్తూ ఎంతో అందమైన పహల్గాంలో జరిగిన పాశవిక దాడి గురించి తెలిసి తన గుండె బరువెక్కిందని అన్నారు. బాధిత కుటుంబాలకు తన సానుభూతి తెలియజేశారు. మరోవైపు నటుడు సోనూసూద్ (Sonu Sood) స్పందిస్తూ.. అమాయక పర్యటకులపై జరిగిన పిరికిపంద ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. నాగరిక ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటు ఉండకూడదని.. ఈ దుర్మార్గపు చర్య ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని తెలిపారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *