2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) లోక్‌సభలో వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు. శనివారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే ఆమె బడ్జెట్ (Union Budget 2025)ను ప్రవేశపెట్టి ప్రసంగిస్తున్నారు. పద్దును ప్రవేశపెడుతూ ఆమె దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ సూక్తిని ప్రస్తావించారు.
గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా
ఈసారి బడ్జెట్ లో గిగ్ వర్కర్లకు నిర్మలమ్మ తీపి కబురు అందించారు. వారికి ఆరోగ్య బీమా ప్రకటించారు. ఈ-శ్రమ్ పోర్టల్(E-shram) కింద ఆరోగ్య గుర్తింపు కార్డులు నమోదు చేసుకోవాలని సూచించారు. పీఎం జన్ ఆరోగ్య యోజన కింద బీమా కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా కోటి మంది గిగ్ వర్కర్లకు ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించారు.






