
వికసిత భారత్ లక్ష్యంగా కేంద్ర సర్కార్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ (Union Budget 2025)ను లోక్సభలో ప్రవేశపెట్టింది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) వరుసగా ఎనిమిదోసారి సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. పేదరిక నిర్మూలన, ఆహార, సామాజిక భద్రత, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యమే లక్ష్యంగా ఈ పద్దు రూపొందించినట్లు ఆమె తెలిపారు. వరుసగా 8 సార్లు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనతను నిర్మలమ్మ సాధించి రికార్డు క్రియేట్ చేశారు.
బడ్జెట్ సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అన్న గురజాడ సూక్తిని ప్రస్తావించారు. ఎన్డీఏ సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశ పెడుతున్న మొదటి వార్షిక బడ్జెట్ ఇది. ఈ సందర్భంగా నిర్మలమ్మ.. ప్రధాన మంత్రి ధన్ ధాన్య యోజన కార్యక్రమాన్ని ప్రకటించారు.