Fire Accident: బస్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రమాదం

విజయవాడ(Vijayawada)లోని పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలో గురువారం సాయంత్రం ఆగి ఉన్న ఓ ప్రైవేట్ బస్సు(Private Bus)లో అకస్మాత్తుగా మంటలు(Fire) చెలరేగి, క్షణాల్లోనే వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఏవీఆర్ ట్రావెల్స్‌కు చెందిన ఈ బస్సులో ప్రమాద సమయంలో ప్రయాణికులు(Passengers) గానీ, సిబ్బంది గానీ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో బస్టాండ్ పరిసరాల్లో కొద్దిసేపు భయాందోళన నెలకొంది.

ఫైర్ సిబ్బంది వచ్చేలోపే..

సమాచారం ప్రకారం, బస్టాండ్ సమీపంలోని పార్కింగ్ ప్రాంతం(Parking Area)లో నిలిపి ఉంచిన ఏవీఆర్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు బస్సు మొత్తానికి వేగంగా వ్యాపించాయి. దట్టమైన పొగలు పరిసర ప్రాంతాలను కమ్మేశాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది(Fire Team) హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. అయితే, వారు రంగంలోకి దిగేలోపే బస్సు చాలా వరకు కాలిపోయింది.

ఈ అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. బస్సులోని ఎలక్ట్రికల్ వ్యవస్థలో ఏర్పడిన లోపం వల్ల మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు.

Related Posts

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మరో వారం రోజులూ జోరు వర్షాలు: IMD

తెలుగు రాష్ట్రాలను వర్షాలు(Rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని నదులు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ(Department of Meteorology) మరో పిడుగులాంటి వార్త చెప్పింది. ఛత్తీస్‌గఢ్‌ పరిసర…

Hyderabad Crime: దారుణం.. ప్రెగ్నెంట్ అయిన భార్యను ముక్కలుగా నరికిన భర్త

హైదరాబాద్‌లోని మేడిపల్లి(Medipally) పరిధి బాలాజీహిల్స్‌(Balaji Hills)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గర్భవతియైన భార్య జ్యోతి(25)ని భర్త మహేందర్ రెడ్డి(Mahendar Reddy) కిరాతకంగా హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేశాడు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన ఈ దంపతులు ప్రేమ వివాహం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *