మహారాష్ట్ర రాజధాని ముంబయి (Mumbai)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రద్దీగా ఉన్న లోకల్ రైలులో నుంచి ప్రయాణికులు జారిపడి ఐదుగురు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం ఆఫీస్లు, ఇతర పనులకు వెళ్లే వారు పలు స్టేషన్లలో ఓ లోకల్ ట్రైన్ ఎక్కారు. జనం కిక్కిరిసి ఉండడంతో చేసేదేంలేక కొందరు డోర్ వద్ద వేలాడారు. ఈ క్రమంలోనే ట్రైన్ రన్నింగ్లో ఉండగా ఓ డోర్ వద్ద ఉన్న 12 మంది అదుపుతప్పి కిందపడిపోయారు. దీంతో వారిలో ఐదుగురు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే చనిపోయారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. రైల్వే యంత్రాంగం, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.
ठाण्याच्या मुंब्रा स्टेशनवर लोकल ट्रेनमधून पडून ५ प्रवाशांचा मृत्यू झाल्याची घटना अतिशय धक्कादायक आहे. १०-१२ जण खाली पडल्याची प्राथमिक माहिती आहे. प्रचंड गर्दीमुळे दरवाजाला लटकून प्रवास करताना भीषण अपघात झाला. #Mumbai #thane #local #Railway pic.twitter.com/otVkCqTXX0
— Rajendra Darda (@RajendrajDarda) June 9, 2025






