Los Angeles Wildfires: లాస్ ఏంజిలిస్‌‌లో ఆగని కార్చిచ్చు.. స్తంభించిన హాలీవుడ్!

అమెరికా(USA)లోని లాస్ ఏంజిలిస్‌(Los Angeles)ను కార్చిచ్చు(Can burn) కమ్మేసింది. దాదాపు 24 గంటలు గడిచినా అక్కడ ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. ఈ మంటల కారణంగా పదివేల మంది హాలీవుడ్(Hollywood) నటులు, మ్యూజీషియన్స్ తమ ఇళ్లను ఖాళీ చేయాల్సి వచ్చింది. వీరందరూ తమ ఇళ్లు, కార్లను వదిలేసి మరీ చేతికి అందిన వస్తువులతో రోడ్ల మీదకు పరిగెత్తారు. దీంతో లాస్‌ ఏంజిలిస్‌లో విపరీతంగా ట్రాపిక్ జామ్(Traffic Jam) ఏర్పడింది. మరోవైపు ఈ మంటల కారణంగా ఐదుగురు చనిపోయారు. అటు కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్, గ్రేటర్ లాస్ ఏంజిల్స్ ప్రాంతాల నుంచి సుమారు 70వేల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

అత్యవర పరిస్థితి ప్రకటన

లాస్‌ ఏంజిలిస్‌ (Los Angeles) లో ప్రకృతికి నిలయమైన ఈశాన్య ప్రాంతంలోని పర్వతాలు మొదట మంటలు చెలరేగాయి.
బలమైన గాలుల కారణంగా అవి వేగంగా విస్తరించాయి. అక్కడి నుంచి అది రాజుకుంటూ మొత్తం నగరాన్ని కబళించింది. దాంతో పాటూ పసిఫిక్‌ పాలిసాడ్స్‌(Pacific Palisades) ప్రాంతంలో మరో అగ్గి రాజుకుంది. ఇది తీరం వెంట ఉన్న సెలబ్రిటీల నివాస ప్రాంతం(A residential area of ​​celebrities) మొత్తాన్ని కమ్మేసింది. ఇదిలా ఉండగా కాలిఫోర్నియా (California) లోని మంటలను అదుపులోకి తీసుకురాడదానికి అక్కడ ఉన్న అగ్నిమాపక సిబ్బంది(Firefighters) సరిపవం లేదు. దీంతో లాస్ ఏంజిలిస్‌లో అత్యవర(Emergency) పరిస్థితిని ప్రకటించారు.

ఆ ప్రాంతంలో నీటి సరఫరా ఆగిపోయింది..

ఇదిలా ఉండగా కార్చిచ్చు కారణంగా హాలీవుడ్(Hollywood) అంతా స్తంభించిపోయింది. సినిమా షూటింగ్స్, ఈవెంట్స్(Film shootings, events) అన్నీ రద్దయిపోయాయి. చాలా మంది ఇళ్లే లేకుండా పోయారు. మళ్లీ ఎప్పటికి అంతా మామూలు అవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి ఇప్పుడు అక్కడ ఏర్పడింది. లాస్ ఏంజిలిస్‌లో చీకటి పొగ వ్యాపించడంతో, ఆ ప్రాంతంలో నీటి సరఫరా(Water supply) ఆగిపోయింది. దీంతో అక్కడి హైడ్రాంట్‌లు ఎండిపోతున్నాయి. మంటలను అదుపు చేయడానికి కష్టంగా ఉంటే ఇప్పుడు ఈ నీటి కొరత మరింత పీడిస్తోందని లాస్ ఏంజిల్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ వాటర్ అండ్ పవర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారులు చెబుతున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *