
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కాన్వయ్కు రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. వరంగల్ పర్యటనలో భాగంగా ఆదివారం జనగామ జిల్లా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్కార్ట్ వాహనం నుజ్జు అయింది. పదేళ్ల క్రితం చీఫ్విఫ్గా ఉన్న సమయంలో హైదరాబాద్ నుంచి ఖమ్మం రోడ్డ మార్గంలో ప్రయాణిస్తుండగా నార్కేట్పల్లి సమీపంలో ఎస్కార్ట్ వాహనం ప్రమదానికి గురైంది.
అప్పటి నుంచి రోడ్డు మార్గాలను తగ్గించారు భట్టి విక్రమార్క. రైలు మార్గాలను కొద్దిరోజులను వినియోగించారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టగానే ఎలికాప్టర్ను మాత్రమే ఎక్కువగానే వినియోగిస్తున్నారు.తాజాగాడిప్యూటీ సీఎం కాన్వాయ్ లోని పోలీస్ వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్ట పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పోలీసు వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. ప్రమాదంలో జనగామ ఎస్ఐ చెన్నకేశవులు, కారు డ్రైవర్ కు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం భట్టి వరంగల్ పర్యటనకు బయలు దేరారు.