జోగులాంబ గద్వాల్ జిల్లాలోని కృష్ణా నదిపై ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు(Jurala Project) వద్ద భారీ వరద ప్రవాహం(Flood) పోటెత్తుతోంది. గత కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర(Maharastra), కర్ణాటక(Karnataka)లో కురిసిన భారీ వర్షాల(Heavy Rains) కారణంగా జూరాలకు లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు అధికారులు 23 గేట్లను ఎత్తి సుమారు 1.27 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 1,15,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 23 గేట్ల ద్వారా 1,24,562 క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుతం 317.520 మీటర్ల వద్ద కొనసాగుతుంది.

ఆ గ్రామాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేసిన అధికారులు
ప్రస్తుతం జూరాల జలాశయంలో నీటి నిల్వ 9.74TMCలకు దగ్గరగా ఉంది. కాగా జూరాల ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 11.94TMCలు. అయితే, గతంలో పూడిక జమ కావడంతో ఈ సామర్థ్యం తగ్గినట్లు అధికారులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా నీటి ప్రవాహాన్ని నిశితంగా పరిశీలిస్తూ, గేట్ల సంఖ్యను అవసరాన్ని బట్టి సర్దుబాటు చేస్తున్నారు. ఈ వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరనుంది. ఇది రాయలసీమ, కృష్ణా డెల్టా ప్రాంతాల రైతులకు లబ్ధి చేకూర్చనుంది. కృష్ణా నది తీరంలోని గ్రామాలైన రామాపూర్, రంగాపూర్, ఈర్లదిన్నె తదితర ప్రాంతాల్లో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నదిలోకి ఎవరూ వెళ్లవద్దని, తీర ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు ఇలాగే కొనసాగితే వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Jurala Project 🏞️🌧️🌳💚🐟
A breathtaking reservoir surrounded by nature. one of the top monsoon spots in Palamoor, Telangana!#HiddenGems #Jurala #MonsoonVibes #Telangana #Palamooru #Mahabubnagar #NatureLovers pic.twitter.com/dGLbSNUrG6— Palamuru Poru bidda (@palamurubidda) July 8, 2025






