
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Finance Minister Nirmala Sitharaman) కాసేపట్లో పార్లమెంట్‌లో బడ్జెట్(Budget) ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే వరుసగా ఏడుసార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆమె.. నేడు 8వ సారి ఆర్థిక పద్దు సభలో ప్రవేశపెట్టనున్నారు. అయితే ప్రతి బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు నిర్మలా సీతారామన్ ధరించే చీర(A saree to wear) ఓ ప్రత్యేకతను చాటుతుంది. ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారి ప్రత్యేక చీరలో కనిపించారు. ఇలా ఏడు బడ్జెట్ల సమర్పణలో ఏడు రంగులలో చీరలు ధరించారు. ఆ చీరల ద్వారా ఆధ్యాత్మికతతో సహా అనేక అంశాలను చాటిచెప్పారు. దేశ ఆర్థిక రంగానికి తనదైన శైలిలో ఒక సందేశం పంపించారు.
చీరతో ప్రాంతం ప్రత్యేకతను చూపిస్తారు..
ఎరుపు, నీలం, పసుపు, గోధుమరంగు, తెలుపు రంగు.. బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రతిసారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారతీయ సంస్కృతి, సంప్రదాయం(Culture and tradition) ఉట్టిపడేలా.. చేనేత వస్త్రాల ప్రాధాన్యతను చాటిచెబుతూ ప్రతిసారి ఆయా రంగుల చీరలను ధరించారు. తాను కట్టుకున్న ప్రతి చీర భారతదేశంలోని ఏదో ప్రాంతం ప్రత్యేకతను వర్ణిస్తుంది. కొన్నిసార్లు అంతర్గతంగా, సూక్ష్మమైన బడ్జెట్ సందేశాలను కూడా అందిస్తోంది. సీతారామన్ ఎంచుకునే అందమైన చీరలు ఒక్కో రాష్ట్రాన్ని సూచిస్తాయి. ఆ ప్రాంత చేనేత ప్రత్యేకతను, అక్కడి కళను చాటిచెబుతుంది. ఈసారి నిర్మలా సీతారామన్ గోల్డ్ వర్క్(Gold work) చేసిన తెల్లటి చీరను ధరించారు.
ఈసారి మధుబని ఆర్ట్ ప్రతిబింబించేలా..
గత సంవత్సరం 2024లో నిర్మలా సీతారామన్ నీలం రంగు టస్సార్ పట్టుచీరను ధరించారు. ఆమె ధరించే చీరతో బడ్జెట్‌కు సంబంధించిన హింట్స్ ఇవ్వడం నిర్మలమ్మ ప్రత్యేకత. ఈసారి బిహార్(Bihar)కు చెందిన చీరను ధరించడంతో ఆ రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత ఉండే అవకాశం ఉంది. బిహార్ రాష్ట్రానికి చెందిన మధుబని ఆర్ట్(Madhubani Art), పద్మ అవార్డు గ్రహీత దులారి దేవి కళకు గౌరవ సూచకంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ చీరను ధరించారు. కాగా కాసేపటి క్రితమే నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకి బడ్జెట్ కాపీని అందజేశారు. అనంతరం మంత్రి ఆర్థిక శాఖ కార్యాలయానికి బయల్దేరారు. పద్దుకు క్యాబినెట్ ఆమోదం తెలిపాక పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
#WATCH | Union Finance Minister Nirmala Sitharaman and MoS Finance Pankaj Chaudhary arrive at Rashtrapati Bhavan to meet President Droupadi Murmu ahead of tabling #Budget2025 #BudgetWithETNOW @FinMinIndia @nsitharaman pic.twitter.com/SOEhlAJetp
— ET NOW (@ETNOWlive) February 1, 2025