ఇప్పుడు చాలా మంది ప్రైవేట్ ఉద్యోగులు(Employees) ఉద్యోగ విరమణ తరువాత భద్రత కోసం ఈపీఎఫ్ఓ (EPFO)లో సభ్యులుగా చేరుతుంటారు. ప్రతి నెలా వారి వేతనం నుండి కొంత డబ్బును పీఎఫ్ ఖాతా(PF Account)లో జమ చేస్తారు. ఈ ప్రక్రియను సులభంగా పర్యవేక్షించేందుకు ప్రతి సభ్యుడికి యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ప్రత్యేక గుర్తింపు నంబర్ కేటాయించబడుతుంది. అయితే కొన్నిసార్లు ఈ నంబర్ మర్చిపోవడం, అవసరమైన సమయంలో గుర్తుకు రాకపోవడం వల్ల ఉద్యోగులు అసౌకర్యానికి గురవుతుంటారు.
వాట్సాప్‌లో ఉచితంగా PF బ్యాలెన్స్ చెక్ చేయొచ్చు.. ఎలా అంటే?
ఇకపై అలాంటి సమస్యలు ఎదురయ్యే అవసరం లేదు. యూఏఎన్ నంబర్‌ను చాలా ఈజీగా తెలుసుకునే విధానం ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. మీరు www.epfindia.gov.inలోకి వెళ్లి, “Services” మెనూ కింద “For Employees” ఎంపికను ఎంచుకోవాలి. అక్కడ “Member UAN/Online Service” అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే, యూనిఫైడ్ మెంబర్ పోర్టల్‌కి వెళ్లవచ్చు.
ఈ పోర్టల్‌లో మీ వ్యక్తిగత వివరాలు.. పూర్తి పేరు, పుట్టిన తేది, ఆధార్/PAN నంబర్, మొబైల్ నంబర్.. ఇచ్చిన తర్వాత ఓటీపీతో “Show my UAN” బటన్‌పై క్లిక్ చేస్తే, మీ యూఏఎన్ నంబర్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఇలా కొన్ని నిమిషాల్లోనే మీరు మర్చిపోయిన UAN నంబర్‌ను తిరిగి పొందవచ్చు.
ఈ నంబర్ ఆధారంగా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయడం, పాస్‌బుక్ చూడడం, క్లెయిమ్‌లు వంటివి సులభంగా చేయవచ్చు. కాబట్టి యూఏఎన్ నంబర్ గుర్తుంచుకోవడం ఎంత ముఖ్యమో, అవసరమైనపుడు ఎలా రీట్రీవ్ చేయాలో కూడా తెలుసుకోవడం అవసరం.






