ఈడీకి భయపడం.. మోదీకి భయపడం: KTR

అసెంబ్లీ సమావేశాల చరిత్ర(History of Assembly Sessions)లో ఎప్పుడూ చెప్పని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) అబద్ధాలు చెప్పిందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆరోపించారు. అసెంబ్లీ సెషన్స్ ముగిసిన తర్వాత ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌(Assembly Media Point)లో మాట్లాడారు. రైతుబంధు డబ్బులు ఎగ్గొట్టారు.. రైతుబంధు(Rythubandu) దుర్వినియోగం అయ్యిందని ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు. పత్తి రైతులు 8నెలలు పంట పండిస్తారు. వారికి రెండో విడత రైతుబంధు ఇవ్వరా? అని ప్రశ్నించారు. పత్తి రైతులు, కంది రైతులు మోసపోకండి. రైతు ఆత్మహత్యలపైనా CM రేవంత్ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.

ఏ గ్రామంలో 100% రుణమాఫీ కాలేదు

రైతు బంధు ఎగ్గొట్టేందుకే క్యాబినెట్ సబ్ కమిటీ(Cabinet Sub Committee) అని పేర్కొన్నారు. రైతు రుణమాఫీ(Runamafi) విషయంలో వాళ్ల డొల్లతనం బయట పడింది. CM 100% రుణమాఫీ అయింది అంటే.. వాళ్ళ MLAలే 70% అని చెప్తున్నారన్నారు. ఏ గ్రామంలో కూడా పూర్తిగా రుణమాఫీ కాలేదని KTR తెలిపారు. రుణమాఫీ చేయలేదు. రైతు బంధు ఇవ్వలేదు అని తాము అడిగితే CMకు కోపం వచ్చిందన్నారు. ప్రభుత్వం కాకి లెక్కలు తాము నమ్మడం లేదని కేటీఆర్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నిక(local body elections)ల్లో అందరూ కలిసి కాంగ్రెస్‌(Congress)కి బుద్ధి చెప్పాలని కోరారు.

న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది

మరోవైపు.. అసెంబ్లీలో KCR గురించి చాలా చిల్లర మాటలు మాట్లాడారని KTR అన్నారు. ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మరని తెలిపారు. 6 గ్యారంటీలు ఇవ్వని కాంగ్రెస్ నాయకులను గల్లా పట్టి అడగండని కేటీఆర్ పేర్కొన్నారు. BRS రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న కార్యక్రమాల పట్ల భయపడుతున్నారన్నారు. మరోవైపు.. తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడనని అన్నారు. EDకి భయపడం.. MODIకి భయపడమని తెలిపారు. ఎన్ని కేసులు పెట్టినా వెనుకడుగు వేయమని KTR పేర్కొన్నారు. తమకు న్యాయస్థానాల(Courts) మీద నమ్మకం ఉందని చెప్పారు.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *