పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డా.. ఈ డైలాగ్ వింటే మీకు ఎవరు గుర్తొస్తున్నారు. ఒక్క డైలాగ్ తో ఇంటర్నెట ను షేక్ చేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy) గురించి తెలియని వారుండరు. రాజకీయ నేతగానే కాకుండా సోషల్ మీడియాలో మల్లారెడ్డికి ఫాలోయింగ్ ఎక్కువ. ఇక సందర్భం వచ్చిన ప్రతిసారి ఆయన కాలు కదుపుతూ డ్యాన్స్ చేస్తూ అభిమానుల్లో, కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతారు.
డాన్స్ చేస్తూ ఘనంగా హోలీ వేడుకలు జరుపుకుంటున్న మల్లా రెడ్డి
బోయిన్పల్లిలో తన నివాసంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి హోలీ సంబరాలు జరుపుకున్నారు#mallareddy #holicelebrations #Aadhantelugu pic.twitter.com/siNIphrDyx
— Aadhan Telugu (@AadhanTelugu) March 14, 2025
హోలీ వేడుకల్లో మల్లారెడ్డి
తాజాగా హోలీ పండుగ (Holi Celebrations) సందర్భంగా ఆయన బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రెడ్డి బోయిన్‌పల్లిలోని తన నివాసంలో వేడుకలు జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి హోలీ వేడుకల్లో రంగులు చల్లుకుంటూ జాలీగా గడిపారు. అనంతరం డప్పుకొడుతూ డ్యాన్స్ చేశారు.
మల్లన్న స్టెప్పెస్తే..
ఇక మల్లారెడ్డి డ్యాన్స్ (Mallareddy Dance) వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మల్లన్న ఎక్కడుంటే అక్కడ జోష్ ఉంటదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తనదైన స్టెప్పులతో డ్యాన్స్ అదరగొట్టాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మల్లన్నా మజాకా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి మల్లారెడ్డి మరోసారి తన డ్యాన్స్ తో నెట్టింట ట్రెండ్ అవుతున్నారు.






