
టీమ్ఇండియా(Team India) మాజీ క్రికెటర్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ దిలీప్ దోషి(Dileep Doshi, 77) కన్నుమూశారు. కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన లండన్(London)లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రటించారు. కాగా దశాబ్దాలుగా దిలీప్ లండన్‌లోనే నివసిస్తున్నారు. ఆయనకు భార్య కళిందీ, కుమారుడు నయన్, కుమార్తె విశాఖ ఉన్నారు. కాగా దిలీప్ మృతి పట్ల (BCCI) తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ‘ఆయన మరణం చాలా విచాకరం. దిలీప్ ఆత్మకు శాంతి చేకూరాలి’ అని ఎక్స్(X)లో ట్వీట్ చేసింది.
The BCCI mourns the sad demise of former India spinner, Dilip Doshi, who has unfortunately passed away in London.
May his soul rest in peace 🙏 pic.twitter.com/odvkxV2s9a
— BCCI (@BCCI) June 23, 2025
30 ఏళ్ల వయస్సులో జట్టులోకి ఎంట్రీ
కాగా దిలీప్ దోషి 1947 డిసెంబర్ 22న అప్పటి రాజ్‌కోట్ సంస్థానం(Rajkot State)లో జన్మించారు. తన అద్భుతమైన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్‌తో 30 ఏళ్ల వయసులో 1979 సెప్టెంబర్ 11న ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్(International Cricket)లోకి ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చారు. ఆయన భారత్‌కు 1979 నుంచి 1983 మధ్య కాలంలో సేవలందించారు. మొత్తం 33 టెస్టు మ్యాచ్‌లుvఆడారు. టెస్టు క్రికెట్‌లో 30.71 సగటుతో మొత్తం 114 వికెట్లు పడగొట్టారు. 15 వన్డేల్లో 22 వికెట్లు తీశారు. కాగా దిలీప్ మృతి పట్ల పలువురు భారత మాజీ క్రికెటర్లు, ప్రస్తుత ప్లేయర్లు సంతాపం(Condolence) వ్యక్తం చేశారు.