అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్. శబరిమల (Sabarimala) వెళ్లే భక్తుల కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. కడప మీదుగా కేరళలోని కొట్టాయం, కొల్లాం ప్రాంతాలకు ఈ నెలలోనే 4 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు తెలిపింది. ఈ నెల 14, 21, 28 తేదీల్లో 07133 నంబరు గల రైలు కాచిగూడలో మధ్యాహ్నం 3.40 గంటలకు బయల్దేరనుంది.
కాచిగూడ నుంచి రైలు
అదేరోజు రాత్రి 12.10 గంటలకు కడపకు చేరుకుంటుందని కడప రైల్వే సీనియర్ కమర్షియల్ ఇన్స్పెక్టరు ఎ.జనార్దన్ వెల్లడించారు. ఆ తర్వాత రోజు సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకు కొట్టాయం చేరుకుంటుందని.. తిరుగు ప్రయాణంలో 07134 గల రైలు ఈనెల 15, 22, 29 తేదీల్లో రాత్రి 8.30 గంటలకు కొట్టాయం నుంచి బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు కడపకు చేరుకుంటుందని తెలిపారు. ఆ రాత్రి 11:40 నిమిషాలకు కాచిగూడ(Kachiguda Station)కు వచ్చేస్తుందని పేర్కొన్నారు.
హైదరాబాద్ నుంచి ఓ రైలు
మరోవైపు ఈ నెల 19, 26వ తేదీల్లో హైదరాబాద్లో 07135 నంబరు గల రైలు మధ్యాహ్నం 12 గంటలకు బయల్దేరి రాత్రి 10.25 గంటలకు కడప(Kadapa Train)కు చేరి.. మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు కొట్టాయం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 07136 నంబరు రైలు ఈ నెల 20, 27 తేదీల్లో సాయంత్రం 6.10 గంటలకు కొట్టాయంలో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 11.50 గంటలకు కడప.. రాత్రి 11 గంటల 45 నిమిషాలకు హైదరాబాద్ చేరుతుంది.
నాందేడ్ నుంచి మరో రైలు
07139 నంబర్ రైలు ఈ నెల 16న ఉదయం 8.20 గంటలకు నాందేడ్ (Nanded) నుంచి బయల్దేరి మరుసటి రోజు తెల్లవారుజామున 2.50 గంటలకు కడప.. రాత్రి 10. 30 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 18న మరో రైలు (07140) తెల్లవారుజామున 2.30 గంటలకు కొల్లాంలో బయలుదేరి అదే రోజు రాత్రి 11 గంటలకు కడప.. మరోసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
మౌలాలీ నుంచి ఓ రైలు
హైదరాబాద్ మౌలాలీలో ఈ నెల 23, 30న 07141 నంబరు గల రైలు మధ్యాహ్నం 2.45 గంటలకు బయల్దేరి తర్వాత రోజు తెల్లవారుజామున 2.50 గంటలకు కడప చేరుకుంటుంది. రాత్రి 10.30 గంటలకు కొల్లాం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 25, డిసెంబర్ 2వ తేదీల్లో 07142 నంబర్ రైలు కొల్లాంలో తెల్లవారుజామున 2.30 గంటలకు బయల్దేరి, అదే రోజు రాత్రి 11 గంటలకు కడపకు, మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు మౌలాలీకి చేరుతుంది.