హైదరాబాద్(Hyderabad) వేదికగా జరుగుతున్న ప్రపంచ సుందరి పోటీలు(Miss World Pageant 2025) ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. ప్రతిష్ఠాత్మక మిస్ వరల్డ్ కిరీటాన్ని(Miss World Crown) దక్కించుకునేందుకు 109 దేశాల అందగత్తెలు పోటీ పడుతున్నారు. అమెరికా కరేబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా-ఓషియానా కాంటినెంటల్ క్లస్టర్ల నుంచి పలు అంశాల్లో ప్రతిభ కనబరిచిన వారిని తదుపరి దశకు ఎంపిక చేస్తున్నారు. నిన్న నిర్వహించిన టాలెంట్ పోటీల రెండో రౌండ్(2nd Round)లో అద్భుతమైన ప్రతిభ చూపిన 48 మంది సుందరీమణులు క్వార్టర్ ఫైనల్స్(Quarterfinals)కు అర్హత సాధించారు.
నేడు, రేపు కాంటినెంటల్ ఫినాలేలు
ఈ టాలెంట్ విభాగంలో నేపాల్(Nepal), హైతీ, ఇండోనేసియా దేశాలకు చెందిన అందగత్తెలు ఇంకా తమ ప్రతిభను ప్రదర్శించాల్సి ఉందని మిస్ వరల్డ్ నిర్వాహకులు(Organizers of Miss World) తెలిపారు. వీరి ప్రదర్శన అనంతరం, వారిలో ఎంపికైన వారు కూడా క్వార్టర్ ఫైనల్స్(Quarterfinals)లో పోటీపడతారు. ఈ పోటీల్లో భాగంగా హైదరాబాద్‌లోని టీ హబ్(T Hub)లో నేడు, రేపు కాంటినెంటల్ ఫినాలే(Continental Finale)లు జరగనున్నాయి. ఈ ఫినాలేలలో వివిధ ఖండాల నుంచి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సుందరీమణులు తదుపరి రౌండ్లకు ఎంపికవుతారు.
PEOPLE / @missworld 2025: @princesseissie se qualifie pour les 1/4 de finale du Challenge Talent
La candidate camerounaise Issie Marie Princesse brille à la 72ᵉ édition de Miss World. Elle fait partie des 48 candidates ( sur les 108 en compétition) retenues pic.twitter.com/THdtvwpwDL
— Laura Dave Média (@LauraDaveMedia) May 18, 2025






