Atlee: డైరెక్టర్ అట్లీకి డాక్టరేట్.. ఫ్యాన్స్ విషెస్

పాన్ ఇండియా మూవీస్ డైరెక్టర్ అట్లీ(Director Atlee)కి మరో ఘనత దక్కింది. చెన్నైకి చెందిన సత్యభామ యూనివర్సిటీ(Satyabhama Univercity) ఆయనకు డాక్టరేట్(Doctorate) ప్రకటించింది. జూన్ 14న జరిగే యూనివర్సిటీ 35వ స్నాతకోత్సవ వేడుకలో అట్లీకి డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు(Wishes) తెలియజేస్తున్నారు. కోలీవుడ్‌(Kollywood)లో ప్రముఖ దర్శకుడుగా పేరొందిన అట్లీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.

టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు

కాగా రాజారాణి(Raja Rani), తేరి (పోలీసోడు), మెర్సల్ (Adirindi), బిగిల్ (Whistle) చిత్రాలతో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌(Tollywood)లోనూ మంచి గుర్తింపు పొందారు. షారూక్ ఖాన్ హీరోగా ఆయన తెరకెక్కించిన జవాన్(Jawan) చిత్రం రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఆయన తదుపరి చిత్రం ఎవరితో ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌(Allu Arjun)తో ఆయన మూవీ చేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *