భారతదేశంలోని విద్యార్థులకు గూగుల్ శుభవార్త చెప్పింది. విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకాన్ని ప్రోత్సహించేందుకు, గూగుల్ “Gemini for Students” పేరిట ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా, భారతీయ విద్యార్థులు ఏడాది పాటు గూగుల్ జెమినీ అడ్వాన్స్‌డ్ ప్లాన్‌ను(Google Gemini Advanced Plan) పూర్తిగా ఉచితంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది.
ఈ ఆఫర్ కోసం 18 ఏళ్లు పైబడిన విద్యార్థులు(Students) సెప్టెంబర్ 15 లోపు గూగుల్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవాలి. ఓసారి నమోదు పూర్తయితే, విద్యార్థులు నెలకు ₹19,500 విలువ చేసే జెమినీ 2.5 ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను ఒక సంవత్సరం పాటు ఉచితంగా వాడుకోవచ్చు. ఇందులో విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక టూల్స్, 2 టెరాబైట్ల క్లౌడ్ స్టోరేజీ వంటి అదనపు లాభాలు లభిస్తాయి.
ఈ ప్లాన్‌తో విద్యార్థులు హోంవర్క్‌లు, పరీక్షల సిద్ధత, వ్యాస రచన, కోడింగ్, ఇంటర్వ్యూల ప్రిపరేషన్ వంటి విద్యా కార్యకలాపాలకు అవసరమైన పూర్తి AI సహాయాన్ని పొందవచ్చు. నోట్బుక్ ఎల్ఎమ్, డీప్ రీసెర్చ్ టూల్, Gemini Live వంటి ఫీచర్లు చదువులో నాణ్యతను పెంచడంలో సహాయపడతాయి. ఇక ప్రజెంటేషన్లు, ప్రాజెక్టుల కోసం గూగుల్ వాయోలిన్ అనే AI ఆధారిత వీడియో క్రియేటర్ టూల్ కూడా ఇందులో భాగంగా లభిస్తుంది.
ఈ ఆఫర్‌కు గూగుల్ ఎలాంటి యూజర్ పరిమితిని విధించలేదు. విద్యారంగంలో AI వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, విద్యార్థుల భవిష్యత్తు ప్రణాళికలకు దోహదపడేందుకు గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై విద్యార్థులకు జెమినీ ఓ డిజిటల్ స్నేహితుడిగా మారనుంది.






