Mana Enadu: ఇటు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government in Telangana).. అటు ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం(Alliance government in Ap) ప్రజలపై ఉచిత స్కీముల( free schemes)తో వరాలు కురిపిస్తున్నాయి. తమతమ ఎన్నికల మ్యానిఫెస్టో(Election Manifesto) ప్రకటించినట్లు ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో ఫ్రీ బస్(free bus), ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ వంటివి CM రేవంత్ సర్కార్ అమలు చేస్తోంది. రుణమాఫీ(Runamafi) సైతం రైతులకు అందజేసింది. అటు APలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సామాజిక పింఛన్లు పెంచింది. ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చింది. తాజాగా దీపం-2 పథకాన్ని అమలు చేసింది. దీనిని ఇవాళ (నవంబర్ 1) CM చంద్రబాబు అధికారికంగా ప్రారంభించారు. అయితే ఈ ఫ్రీ గ్యాస్ పథకం(Free Gas Scheme)తో తెలుగు రాష్ట్రాలలో ఎవరికి ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఏపీలో ఇలా..
ఆంధ్రప్రదేశ్(AP)లో దీపం-2 పథకం(Deepam-2 scheme) కింద ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఒక సిలిండర్ ధర రూ.860 అనుకుంటే ఏడాదికి 3 సిలిండర్ల ద్వారా మొత్తం రూ.2,580 లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. ఇలా 5 ఏళ్ల కాలంలో మొత్తం 13 సిలిండర్లను ఇవ్వబోతున్నారు. తద్వారా వస్తున్న మొత్తం లబ్ది 860*13= రూ.11,180లను ఏపీలోని కూటమి ప్రభుత్వం చెల్లించనుంది.

తెలంగాణలో అలా..
ఇక తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500కే సిలిండర్ ఇస్తోంది. ఇలా సంవత్సరానికి 12 సిలిండర్లు ఇస్తోంది. తద్వారా ఒక్కో సిలిండర్ ద్వారా ప్రజలకు కలుగుతున్న లబ్ది రూ.360. ఆ లెక్కన సంవత్సరానికి కలుగుతున్న లబ్ధి 12 సిలిండర్లకు 360*12 = రూ.4,320 వస్తోంది. అయితే మహాలక్ష్మి పథకం(Mahalakshmi Scheme) ఫిబ్రవరి నుంచి అమలవుతోంది. కాబట్టి 10 నెలలకు 360*10= రూ.3,600. మొత్తం 5 సంవత్సరాల్లో వచ్చే లబ్ధి రూ.3,600 + 4,320*4 = రూ.20,880లను రేవంత్ సర్కార్ చెల్లిస్తోంది. ఇలా ఐదేళ్ల కాలానికి లెక్కిస్తే.. AP ప్రజలు పొందే మొత్తం లబ్ధి రూ.11,180గా ఉండగా TG ప్రజలు పొందేది రూ.20,880గా ఉంది. అంటే ఏపీ ప్రజల కంటే తెలంగాణ ప్రజలు 20880 – 11180 = రూ.9,700 ఎక్కువ మొత్తాన్ని పొందుతున్నట్లు లెక్క.







