మీరు వాడే వంటనూనె స్వచ్ఛమేనా.. ఇలా కనిపెట్టండి!

Mana Enadu : కుక్క పిల్ల, ఆడపిల్ల, సబ్బు బిల్ల.. కాదేది కవితకు అనర్హం అన్నాడు ఆనాడు ఓ కవి. పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి.. కాదేది కల్తీకి అనర్హం అన్నట్లుంది నేటి పరిస్థితి. ప్రస్తుతం దేశంలోని ఆహార పదార్థాలు, నిత్యావసరాలు కల్తీ అవుతున్నాయి. కొందరు అక్రమార్కుల కక్కుర్తి వల్ల పిల్లలు తాగే పాల (Milk) నుంచి నీళ్లు, నూనె, పండ్లు, కూరగాయలు కూడా విషంగా మారుతున్నాయి. ప్రజలను రోగాల బారిన పడేస్తున్నాయి.

ఎక్కడ చూసినా కల్తీ నూనె

ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్తీ నూనె (Adulterated Edible Oil) రాజ్యమేలుతోంది. ఓవైపు ధరల మంటతో సామాన్యులు ఇబ్బంది పడుతుంటే.. మరోవైపు కల్తీ నూనెలతో అనారోగ్యం బారిన పడుతున్నారు. అయితే చాలా మందికి తాము ఉపయోగించే నూనె స్వచ్ఛమైనదా కాదా అనే విషయం తెలియదు. మరి మీరు వంటలో వినియోగిస్తుంది స్వచ్ఛమైన నూనేనా.. కాదా తెలుసుకోవాలనుకుంటున్నారా. కల్తీ నూనెను గుర్తించేందుకు తాజాగా ఫుడ్​ సేఫ్టీ అండ్​ స్టాండర్డ్స్​ ఆథారిటీ ఆఫ్​ ఇండియా (FSSAI) పలు సూచనలు చేసింది.

టీఓసీపీ రసాయనంతో నూనె కల్తీ

వంటనూనెల్లో ‘ట్రై ఆర్థో క్రెసిల్ ఫాస్ఫేట్‌ (Tri-Ortho-Cresyl-Phospate)’ అనే రసాయనాన్ని ఉపయోగించి కల్తీ చేస్తున్నారు. ఇలాంటి నూనెలు వినియోగించడం వల్ల నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా చాలా మందికి పక్షవాతం వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయి. అందుకే మనం వాడుతోంది కల్తీ నూనెనా.. లేక స్వచ్ఛమైన నూనెనా అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. మరి  ఎఫ్ఎస్ఎస్ఏఐ సూచనలతో మీ నూనె గుట్టు పట్టేయండిలా..

కల్తీ నూనెను ఇలా కనిపెట్టేయండి..  

Tips to Find the TOCP in Cooking Oil

  • ముందుగా  ఓ చిన్న పాత్రలో రెండు మిల్లీ లీటర్ల నూనె తీసుకోవాలి
  • అందులో గట్టిగా పసుపు రంగులో ఉన్న బటర్​ వేయాలి.
  • కొద్దిసేపటి తర్వాత గమనించాలి.
  • పాత్రలోని నూనె రంగు మారకుండా ఉంటే అది స్వచ్ఛమైన నూనె అని అర్థం.
  • నూనె ఎరుపు రంగులోకి మారితే అది కల్తీ అయినట్లని అర్థం.

Related Posts

Bonala Jathara 2055: భాగ్యనగరంలో బోనాల జాతర షురూ.. నేడు జగదాంబిక ఎల్లమ్మకు తొలిబోనం

ఆషాఢ మాసం బోనాలు(Bonalu) నేటి (గురువారం) నుంచి ప్రారంభం కానున్నాయి. చారిత్రక గోల్కొండ కోట(Golconda Kota)పై వెలిసిన జగదాంబిక ఎల్లమ్మ(Jagadambika Yellamma) ఆలయంలో జరిగే తొలి బోనంతో బోనాల సందడి ప్రారంభం కానుంది. ‘డిల్లం.. బల్లెం.. కుడకలు బెల్లం’ అంటూ ఆదిపరాశక్తి…

Tirumala Updates: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం

కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరస్వామి(Sri Venkateswara Swamy)వారిని దర్శించుకునేందుకు భక్తులు(Devotees) భారీగా తరలివచ్చారు. దీంతో తిరుమల(Tiruala)లో భక్తుల రద్దీ పెరిగింది. గురువారం ఉదయం కూడా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *