Telangana: మహిళలకు శుభవార్త.. నేటి నుంచి మహిళా సంఘాల ఖాతాల్లో నిధుల జమ

తెలంగాణలోని సీఎం రేవంత్ సర్కార్(Telangana Govt) మహిళా స్వయం సహాయక సంఘాల(Women’s Self-Help Groups)కు శుభవార్త అందించింది. రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాల(Interest Free Loans)ను విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సెర్ప్‌(SERP)కు రాష్ట్ర ఆర్థిక శాఖ(State Finance Department) నిధులు మంజూరు చేసింది. మొత్తం రూ.344 కోట్లలో రూ.300 కోట్లు గ్రామీణ మహిళా సంఘాలకు కేటాయించగా, రూ.44 కోట్లు పట్టణ మహిళా సంఘాలకు కేటాయించారు. ఈ రోజు (శనివారం) నుంచి 18వ తేదీ వరకు మహిళా సంఘాల ఖాతాల్లో వడ్డీలు జమ చేయనున్నారు.

Throw out BRS regime, Revanth tells women - The Hindu
మంత్రులు, MLAల ఆధ్వర్యంలో..

ఈ క్రమంలో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, MLAలు చెక్కుల పంపిణీ చేయనున్నారు. అదే విధంగా ప్రమాద బీమా(Insurance), లోన్ బీమా చెక్కులను సైతం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వడ్డీ లేని రుణాలు గత BRS హయాంలో నిలిచిపోయిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో సుమారు రూ.3 వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టింది. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీ లేని రుణాల చెల్లింపుపై నిర్ణయం తీసుకున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *