NEW CS: సీఎం రేవంత్‌ను కలిసిన కాబోయే సీఎస్ రామకృష్ణారావు

తెలంగాణ ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శి(Cheif Secretary )గా కే.రామకృష్ణారావు(K.Ramakrishna Rao) నియమితులైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన సోమవారం మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని సెక్రటేరియట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి(Shanti Kumari) ఈనెల 30న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆమె స్థానంలో రామకృష్ణారావును ప్రభుత్వం CSగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుతం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా..

ప్రస్తుతం రామకృష్ణారావు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి(Principal Secretary, Finance Department)గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సీనియారిటీ జాబితా ప్రకారం ఆయనతో పాటు మరో ఆరుగురు అధికారులు ప్రధాన కార్యదర్శి పదవి రేసులో ఉండగా, ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలించి రామకృష్ణారావును నియమించాలని నిర్ణయించింది. రామకృష్ణారావు 1991 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. కాగా 2016 ఫిబ్రవరి నుంచి ఆర్థిక శాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆయన పదవీ కాలం 2026, ఆగస్టుతో ముగియనున్నది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *