OTT’s: ఓటీటీల్లో అసభ్యకరమైన కంటెంట‌్‌పై సుప్రీంకోర్టు సీరియస్

ప్రస్తుతం ఓటీటీ(OTT)ల ట్రెండ్ నడుస్తోంది. థియేటర్లకు వెళ్లలేని వారు, రోజురోజుకీ పెరుగుతున్న మూవీ టికెట్ల ధరలు(Movie Ticket Rates) భరించలేని వారంతా ఎంచక్కా ఇంట్లోనే కూర్చొని ఓటీటీల వేదికగా సినిమాలను చేసేస్తున్నారు. దీనిని క్యాష్ చేసుకుంటున్న కొన్న సినిమాల మేకర్స్ థియేటర్, డిస్ట్రిబ్యూటర్ల ఖర్చులను తగ్గించుకుంనేందుకు కొత్త చిత్రాలను నేరుగా ఓటీటీల్లోనే రిలీజ్ చేస్తున్నారు. ఇక అదనుగా వేల సంఖ్యలో అశ్లీలు(Pornography), అసభ్యకరమైన కంటెంట‌్(Obscene Content)ను ప్రసారం చేస్తున్నాయి. దీంతో ఇటీవల కాలంలో ఓటీటీలపై తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు(Supreme Court) రంగంలోకి దిగింది.

ఓటీటీ వేదికలు, సామాజిక మాధ్యమా(Social Media)ల్లో ప్రసారమవుతున్న అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్‌ను నియంత్రించాలంటూ దాఖలైన పిటిషన్‌(Petition)పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ అంశంపై స్పందన తెలియజేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం(Central Govt)తో పాటు పలు ఓటీటీ, సోషల్ మీడియా సంస్థలకు సోమవారం నోటీసులు జారీ చేసింది. జస్టిస్ BR గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది.

కంటెంట్ నియంత్రణ అథారిటీని ఏర్పాటు చేయాలి

అలాగే OTT, సోషల్ మీడియా(SM)లో లైంగికంగా అసభ్యకరమైన కంటెంట్‌ను నిషేధించేందుకు, కట్టడి చేసేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని, ఇందుకోసం ఒక జాతీయ కంటెంట్ నియంత్రణ అథారిటీని(National Content Regulatory Authority) ఏర్పాటు చేయాలని ఐదుగురు పిటిషనర్లు తమ వ్యాజ్యంలో కోర్టును అభ్యర్థించారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి అభ్యంతరకరమైన కంటెంట్ వల్ల కేవలం పిల్లలు, యువత మాత్రమే కాకుండా పెద్దల ఆలోచనలు కూడా కలుషితం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *