Gaddar Awards: గద్దర్ అవార్డుల ప్రకటన.. ఉత్తమ చిత్రాలు, నటులు వీరే

తెలంగాణలో ప్రభుత్వం సినీ అవార్డులను ప్రకటించింది. ప్రముఖ నటి జయసుధ నేతృత్వంలోని జ్యూరీ గురువారం గద్దర్ అవార్డులను అనౌన్స్ చేసింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌ నిలిచాడు. పుష్ప 2లో నటనకు గానూ ఆయనకు ఈ అవార్డు దక్కింది. 35 చిన్న కథ కాదు మూవీలో తల్లి పాత్ర పోషించి మెప్పించిన నివేదా థామస్‌ ఉత్తమగా నటిగా నిలిచింది. ఇక ఉత్తమ దర్శకుడిగా నాగ్‌ అశ్విన్‌ (కల్కి 2898 ఏడీ) ఎంపికయ్యాడు. ఉత్తమ సహాయ నటుడిగా ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం). ఉత్తమ సహాయ నటిగా శరణ్యా ప్రదీప్‌ (అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌) నిలిచారు.

మొత్తం 1248 నామినేషన్లు

ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు వచ్చినట్లు జ్యూరీ తెలిపింది. కాగా వాటిని పరిశీలించిన అనంతరం అవార్డు గ్రహీతల పేర్లను అనౌన్స్ చేశారు. 14 ఏళ్ల తర్వాత ఈ అవార్డులను ప్రకటించారు. మొత్తం 11 కేటగిరీల్లో వీటిని వెల్లడించారు. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు ఏడాదికి ఒక ఉత్తమ చిత్రానికి, 2014 నుంచి 2023 వరకు సెన్సార్ అయిన చిత్రాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. 2024కు సంబంధించి అన్ని కేటగిరీల్లోనూ అవార్డులు ఇచ్చారు. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు సహా మొత్తం 21 మందికి వ్యక్తిగత, స్పెషల్ జ్యూరీ అవార్డులు ఇచ్చారు.

2024 బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్స్‌ ఇవే..

* కల్కి 2898ఏడీ (మొదటి బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్స్‌)

* పొట్టేల్‌ (రెండో బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్స్‌)

* లక్కీ భాస్కర్‌ (మూడో బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్స్‌)

ఉత్తమ నటీనటులు, సాంకేతిక నిపుణులు వీరే..

* ఉత్తమ నటుడు – అల్లు అర్జున్‌ (పుష్ప 2)

* ఉత్తమ నటి – నివేదా థామస్‌ (35 ఇది చిన్న కాదు)

* ఉత్తమ దర్శకుడు – నాగ్‌ అశ్విన్‌ (కల్కి)

* ఉత్తమ సహాయ నటుడు – ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం)

* ఉత్తమ సహాయ నటి – శరణ్యా ప్రదీప్‌ (అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌)

* ఉత్తమ సంగీత దర్శకుడు – బీమ్స్‌ (రజాకార్‌)

* ఉత్తమ నేపథ్య గాయకుడు – సిద్‌ శ్రీరామ్‌ (ఊరి పేరు భైరవకోన)

* ఉత్తమ నేపథ్య గాయని – శ్రేయా ఘోషల్‌ (పుష్ప 2)

* ఉత్తమ హాస్యనటులు – సత్య, వెన్నెల కిశోర్‌ (మత్తువదలరా 2)

* ఉత్తమ బాలనటులు – మాస్టర్‌ అరుణ్‌ దేవ్‌ (35 చిన్న కథ కాదు), బేబీ హారిక

* ఉత్తమ కొరియోగ్రాఫర్‌ – గణేశ్ ఆచార్య (దేవర)

* ఉత్తమ స్క్రీన్‌ ప్లే రచయిత – వెంకి అట్లూరి (లక్కీ భాస్కర్‌)

* ఉత్తమ గేయ రచయిత – చంద్రబోస్‌ (రాజూ యాదవ్‌)

* ఉత్తమ కథా రచయిత – శివ పాలడుగు (మ్యూజిక్‌ షాప్‌ మూర్తి)

* ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ – విశ్వనాథ్‌రెడ్డి (గామి)

స్పెషల్ జ్యూరీ అవార్డులు వీరికే..

* నటుడు – దుల్కర్‌ సల్మాన్‌ (లక్కీ భాష్కర్‌)

* నటి – అనన్య నాగళ్ల (పొట్టేల్‌)

* దర్శకులు – సూజిత్‌, సందీప్‌ (క)

* నిర్మాతలు – ప్రశాంత్‌ రెడ్డి, రాజేశ్‌ కల్లెపల్లి (రాజూ యాదవ్‌)

* స్పెషల్‌ జ్యూరీ స్పెషల్‌ మెన్షన్‌ – ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా 2)

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *