Game Changer: గేమ్​ ఛేంజర్​ బుకింగ్స్ ఎప్పుడు? ఫ్యాన్స్​ ఎదురుచూపులు

గ్లోబల్​ స్టార్​ రామ్​ చరణ్‌ (Ram Charan), సక్సెస్​ఫుల్​ డైరెక్టర్​ శంకర్‌ కాంబోలో వస్తున్న పొలిటికల్‌ డ్రామా ‘గేమ్ ఛేంజర్‌’పై (Game Changer) భారీ అంచనాలు నెలకొన్నాయి. జనవరి 10న విడుదల కాబోతున్నా.. ఇంకా నైజాం ఏరియాలో బుకింగ్(Bookings)​ మొదలు కాకపోవడంపై అభిమానులు(Fans) అయోమయానికి గురవుతున్నారు. సినిమా రిలీజ్​కు ఇంకా రెండు రోజులే ఉందని, అయినా బుకింగ్​ ఓపెన్​ చేయకపోతే ఎలా ఆందోళన చెందుతున్నారు.

నైజాం ఏరియాలో ఓపెన్​ కాని అడ్వాన్స్​ బుకింగ్​

భారీ బడ్జెట్​తో రూపొందిన గేమ్​ ఛేంజర్​ సినిమాకు USలో చాలా రోజుల క్రితమే అడ్వాన్స్‌ బుకింగ్‌ ప్రారంభం కాగా.. APలో ఇటీవలే ప్రారంభమయ్యాయి. కానీ నైజాం ఏరియాలో ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్‌ మొదలు కాలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి టికెట్ రేట్ల పెంపుకు అనుమతులు వస్తాయని నమ్మకంగా ఉన్నారు నిర్మాత దిల్‌ రాజు (Dil Raju). దీంతో మరోసారి CM రేవంత్‌ రెడ్డితో (Revanth Reddy) చర్చలు జరిపారు. నేడు టికెట్ల రేట్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నా.. ఇప్పటివరకు ఎలాంటి అప్​డేట్​ లేదు.

ధరలు పెంచుతుందని ప్రభుత్వంపై ఆశలు

తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు సానుకూలంగా ఉందని, సంక్రాంతి సినిమాలకు చివరి నిమిషంలో ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఓ ఫిల్మ్‌ జర్నలిస్ట్‌ పేర్కొన్నారు. నేడు తెలంగాణ ప్రభుత్వం నుంచి టికెట్ల రేట్లకు సంబంధించిన GO వస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మూడు సినిమాలకు APలో మాదిరిగా లేదంటే కాస్త తక్కువ రేట్ల పెంపుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీవో రాబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే రేట్లు పెంచేది లేదని CM రేవంత్​ రెడ్డి నొక్కివక్కానిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక వేళ ప్రభుత్వం సానుకూలంగా లేకుంటే నేడు సాయంత్రమే గేమ్‌ ఛేంజర్‌ సినిమా టికెట్ల అడ్వాన్స్ బుకింగ్‌(Advance Bookings) మొదలయ్యే అవకాశం ఉంది.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Megastar Chiranjeevi: చిరూని కలిసి మహిళా వీరాభిమాని.. రాఖీ కట్టి తీవ్ర భావోద్వేగం 

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వీరాభిమాని రాజేశ్వరి(Rajeshwari), తన ఆరాధ్య నటుడిని కలిసేందుకు సైకిల్‌(Cycle)పై సుదీర్ఘ ప్రయాణం చేసి హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఈ సంఘటన చిరంజీవిని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాక, అభిమానుల హృదయాలను కూడా కదిలించింది. రాజేశ్వరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *