భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్(Head coach Gautam Gambhir)కు, సీనియర్ క్యురేటర్ లీ ఫార్టిస్(Lee Fortis) మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ వివాదం ఓవల్(Oval Ground) క్రికెట్ స్టేడియంలోని పిచ్ విషయంలో జరిగినట్లు తెలుస్తోంది. నేషనల్ మీడియా ప్రకారం.. ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు కోసం ‘ది ఓవల్’ స్టేడియంలో భారత జట్టు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో గంభీర్, పిచ్ క్యురేటర్ లీ ఫార్టిస్ మధ్య గొడవ జరిగింది. ఒక పిచ్‌పై భారత జట్టు ప్రాక్టీస్ చేస్తుండగా ఫార్టిస్ వచ్చి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో గంభీర్‌కు కోపం వచ్చేసింది. ఫార్టిస్‌తో వాగ్వాదానికి దిగాడు. గంభీర్ జట్టు వ్యూహానికి అనుగుణంగా పిచ్(Pitch)ను తయారు చేయాలని క్యురేటర్‌ను కోరినట్లు తెలుస్తోంది. అయితే, క్యురేటర్ గంభీర్ సూచనలను పట్టించుకోకుండా తన సొంత విధానంలో పిచ్‌ను సిద్ధం చేశారని, దీంతో గంభీర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. ఈ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.
India head coach Gautam Gambhir was involved in a heated altercation with Surrey groundsman Lee Fortis at The Oval pic.twitter.com/6qBYaBSdkD
— ESPNcricinfo (@ESPNcricinfo) July 29, 2025
గంభీర్ జోక్యం అతిగా ఉందని విమర్శలు
కాగా గంభీర్(Gambhir) తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, పిచ్ తయారీలో జట్టు అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని క్యురేటర్‌ను హెచ్చరించినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటన బీసీసీఐలో చర్చనీయాంశంగా మారింది. కొందరు గంభీర్ జోక్యం అతిగా ఉందని విమర్శిస్తుండగా, మరికొందరు జట్టు విజయానికి కోచ్‌గా గంభీర్ వ్యవహార శైలిని సమర్థిస్తున్నారు. క్యురేటర్ మాత్రం తన వృత్తి నైపుణ్యాన్ని అనుమానించడం సరికాదని వాదిస్తున్నారు. ఈ వివాదం జట్టు ఏకాగ్రతపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. BCCI ఈ విషయంపై అధికారికంగా స్పందించలేదు. కాగా ఇంగ్లండ్-ఇండియా(India vs England) మధ్య చివరిదైన ఐదో టెస్టు(Fifth Test) రేపటి నుంచి ఓవల్ స్టేడియంలో జరగనుంది.

సితాన్షు ఏమన్నారంటే..
దీనిపై భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్(Sitanshu Kotak) మాట్లాడుతూ.. ‘ఒక గ్రౌండ్ స్టాఫ్ వచ్చి.. మేం వికెట్‌కు 2.5 మీటర్ల దూరంలో నిలబడాలని చెప్పాడు. నేను ఎప్పుడూ ఇలాంటి కండిషన్ వినలేదు. దీనిపై కంప్లయింట్స్ ఏముంటాయి? క్యురేటర్ అంత ఫ్రెండ్లీ కాదని మాకు తెలుసు. కానీ ఇంత గొడవ ఎందుకు? మేం స్పైక్స్ వేసుకోలేదు. జస్ట్ జాగర్స్ వేసుకొని ఉన్నాం. కాబట్టి పిచ్‌కు ఎలాంటి ఇష్యూ ఉండదు కదా’ అని వివరించాడు.
India head coach Gautam Gambhir was involved in a confrontation with Surrey ground staff during a training session.
Batting coach Sitanshu Kotak has spoken about the incident at The Oval. pic.twitter.com/fCDK8smMLw
— Test Match Special (@bbctms) July 29, 2025






