Mana Endau: బిగ్బాస్ 8 (Big Boss 8) తెలుగు గ్రాండ్ ఫినాలే చివరి దశకు చేరుకుంది. 105 రోజులపాటు సాగిన ఈ ప్రయాణం ఆదివారంతో ముగియనుంది. ఈరోజు రాత్రికి తేలిపోనుంది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. టాప్-5 కంటెస్టెంట్ల డ్యాన్స్ పెర్ఫామెన్స్, ఎక్స్ హౌస్‌మేట్స్‌కి సంబంధించిన అభిప్రాయాలు, కొంతమంది గెస్టులకి సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఇక నేటి ఎపిసోడ్‌లో కీలకమైన టాప్ -3 షూటింగ్, బ్రీఫ్ కేస్ ఆఫరింగ్, విన్నర్ ప్రకటన షూటింగ్ జరగనుంది. అయితే గ్రాండ్ ఫినాలేకి చీఫ్ గెస్ట్గా గ్లోబల్ స్టార్ రామ్చరణ్ రానున్నట్లు సమాచారం. ఫినాలేకు రామ్ చరణ్ (Ram Charan) వస్తున్నట్లు బిగ్బాస్ నిర్వాహకులు కన్ఫర్మ్ చేశారట. మధాహ్నం తర్వాత ఇందుకు సంబంధించిన షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది.
బిగ్‌బాస్ సీజన్-4కి మెగాస్టార్ చిరంజీవి గెస్టుగా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నాలుగు సీజన్ల తర్వాత రామ్ చరణ్ రావడం విశేషం. సంక్రాంతికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. 2025 జనవరి 10న గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేకి చరణ్ రావడం వల్ల గేమ్ ఛేంజర్‌కు ప్రమోషన్ కూడా జరగనుంది.తాజాగా విడుదలైన ఫినాలే ప్రోమోని గమనిస్తే కన్నడ స్టార్ ఉపేంద్ర, (Upendra) వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి, (Vijay sethupathi) హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఫినాలేలో సందడి చేస్తున్నారు. వీరితో పాటు పుష్ప 2 టీమ్, సాయి ధరమ్ తేజ్ కూడా రానున్నట్లు సమాచారం ఉంది. అలానే హీరోయిన్లు నభా నటేష్, రాయ్ లక్ష్మీ స్పెషల్ డ్యాన్స్ పెర్ఫామెన్స్‌లు చేశారు. సింగర్ గీతామాధురి కూడా పెర్ఫామెన్స్ ఇవ్వనుంది.
వీరితో పాటు సీజన్-8 ఎలిమినేటెడ్ హౌస్‌మేట్స్ కూడా ఫినాలేలో సందడి చేయబోతున్నారు. మొత్తానికి ఫినాలేను గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. బిగ్బాస్ 8 విన్నర్ ఎవరనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నిఖిల్-గౌతమ్ మధ్యనే టైటిల్ విన్నర్ ఉండబోతున్నారనేది అందరికీ తెలిసిందే. అయితే ఓటింగ్‌లో ఇద్దరికీ చాలా టఫ్ ఫైట్ నడిచింది. ఎవరు గెలిచినా చాలా తక్కువ ఓట్ల తేడాతో మాత్రమే విజయం సాధించబోతున్నారు. మరి అది ఎవరో కొన్ని గంటల్లోనే తేలనుంది.








