
గత కొంత కాలంగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు(Gold Rates) నేడూ (ఫిబ్రవరి 18) స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం పుత్తడి రేటు ఎంత పలుకుతుందో తెలుసుకుందాం. హైదరాబాద్(Hyderabad)లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.300 పెరిగి రూ. 79,700 ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమై పసడి రేటు రూ.330 పెరిగి రూ. 86,950వద్ద కొనసాగుతోంది. ఇక కిలో వెండి(Silver Price) ధర రూ. 1,08,000గా ఉంది. తెలంగాణలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
ఇక విజయవాడ(Vijayawada), విశాఖపట్నం(Vizag)లోనూ ఇవే ధరలు ఉన్నాయి. ట్రంప్ టారీఫ్ భయాలు, ఫెడ్ వడ్డీ రేట్ల కోత, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత వంటి అంశాలు బంగారం, వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు(Stock Markets) ఫ్లాటుగా ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందాయి. నిఫ్టీ(Nifty) 22,917 (-40), BSE సెన్సెక్స్ 75,920 (-70) వద్ద చలిస్తున్నాయి. IT మినహా అన్ని రంగాల సూచీలూ నష్టాల్లోనే ఉన్నాయి. ఇక నేడు రూపీ వ్యాల్యూ(Rupee Value) ఒక అమెరికన్ డాలర్‌కు రూ.86.71గా ఉంది.