
గ్లోబల్‌గా టారిఫ్ వార్ కొనసాగుతుండటంతో ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు (Gold Price Today) పెరుగుతూనే ఉన్నాయి. అమెరికా ఆర్థిక మాంధ్యంలోకి జారుకుంటుందనే భయంతో ఇన్వెస్టర్లు గోల్డ్ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు గోల్డ్‌ను భారీగా కొనుగోలు చేస్తున్నాయి. దీంతో బంగారానికి భారీగా డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా పసిడిని ఎంతో ప్రియంగా భావించే భారతదేశంలో పుత్తడి రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి.
బంగారానికి భారీ డిమాండ్
దేశవ్యాప్తంగా గోల్డ్ రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ (Wedding Season) ముందుండటంతో బంగారానికి డిమాండ్ మరింత పెరగనుంది. అయితే పెరుగుతున్న ధరలతో ఇప్పుడు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలంటే మధ్యతరగతి ప్రజలు జంకుతున్నారు. ఇప్పట్లో పసిడి కొనగలిగేలా లేమని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహానగరంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి తెలుసుకుందామా..
వెండి ధరలు ఇలా
హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం (Gold Rates in Hyderabad) 10 గ్రాములపై సోమవారం రోజున రూ.91,910 ఉండగా.. మంగళవారం నాటికి రూ.930 పెరిగి రూ.92,840కు చేరింది. ఇక 22 క్యారెట్లు గోల్డ్ 10 గ్రాముల ధర సోమవారం నాడు రూ.84,250 ఉండగా.. మంగళవారం రోజుకు రూ.850 పెరిగి రూ.85,100 వద్ద పలుకుతోంది. మరోవైపు వెండి ధరలు (Silver Price Today) కూడా విపరీతంగా పెరిగాయి. సోమవారం కిలో వెండి ధర రూ.1,02,684ఉండగా, మంగళవారం నాటికి రూ.341 పెరిగి రూ.1,03,025గా ఉంది.