గుడ్ న్యూస్.. రూ.వేయి తగ్గిన బంగారం ధర.. ఇవాళ్టి రేట్లు ఎంతంటే?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) టారిఫ్ ల విధింపుతో ప్రపంచ మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. ఇక మదుపర్లంతా బంగారమే సేఫ్ అని భావించి భారీగా కొనుగోళ్లు ప్రారంభించారు. దీంతో గోల్డ్ రేట్లు ఆకాశాన్నంటాయి. ఏకంగా 10 గ్రాముల పసిడి ధర రూ.94,000 వరకు చేరింది. మరికొన్ని రోజుల్లో లక్ష రూపాయల వరకు చేరనున్నట్లు నిపుణులు అంచనా వేశారు. అయితే తాజాగా గోల్డ్ ధర ఒక్కసారిగా వేయి రూపాయలకు పైగా తగ్గింది.

తగ్గిన గోల్డ్ రేట్లు

ఇక భారతదేశంలో బంగారానికి (Gold Rates Today) భారీ డిమాండ్ ఉంటుంది. కొంత కాలంగా బంగారం రేట్లు భారీగా పెరుగుతూ వినియోగదారులను హడలెత్తిస్తున్నాయి. సామాన్యులు కొనుగోలు లేని స్థితికి గోల్డ్ రేట్లు చేరుకున్నాయి. ఇప్పటికే పసిడి ధరలు పెరుగుతూ ఆల్ టైమ్ గరిష్ఠాన్ని తాకింది. దీంతో వినియోగదారులు బంగారు ఆభరణాలు కొనాలంటేనే వణికిపోతున్నారు.

వెండి ధరలు  ఇలా

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర గురువారం రోజున రూ.93380 ఉండగా.. శుక్రవారం నాటికి రూ.1,740 తగ్గి రూ.91,640కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ తులం రేటు గురువారం నాడు రూ.85,600 ఉండగా శుక్రవారం రోజుకు రూ.1,600 తగ్గి రూ.84,000 వద్ద పలుకుతోంది. మరోవైపు వెండి ధరలు (Silver Price Today) కూడా భారీగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండిపై రూ. 2000 తగ్గి..  రూ. 1,12,000 వద్దకు దిగివచ్చింది.

Related Posts

Fish Venkat: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ (Fish Venkat) శుక్రవారం (జులై 18) రాత్రి కన్నుమూశారు. 53 ఏళ్ల ఆయన అసలు పేరు మంగిలంపల్లి వెంకటేశ్. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం(serious illness)తో…

IBPS PO 2025 Notification: డిగ్రీ అర్హతతో IBPSలో భారీ నోటిఫికేషన్.. 5,208 పోస్టులు భర్తీ! ఇలా అప్లై చేయండి!

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) మరియు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తాజాగా రెండు కీలక నోటిఫికేషన్ల( Notifications)ను విడుదల చేశాయి. బ్యాంకింగ్, ఇంజనీరింగ్ రంగాల్లో ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం. IBPS PO/MT…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *